
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గ్లోబల్ ఫిల్మ్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని, ఇందులో మహేష్ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని గతంలో రైటర్ విజయేంద్రప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికితోడు ఇప్పుటికే లీక్ అయిన ఫోటోలు, వీడియోలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లీకైన లుక్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచారు మహేష్. ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం అభిమానులు, అలాగే సినీ ప్రియులు ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అంతర్జాతీయంగా ఈ సినిమాని విడుదల చేయసేందుకు హాలీవుడ్ స్టూడియోస్‌తోనే రాజమౌళి డీల్ సెట్ చేస్తున్నారు. ప్రారంభం నుంచి దీన్ని తెలుగు సినిమాలా కాకుండా ఒక అంతర్జాతీయ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హీరోగా పక్కన పెడితే పర్సనల్ గా ఆయన ఎంతటి ఫన్నీగా ఉంటారో, సరదాగా ఉంటారో అనే విషయం కొంత మందికే తెలుసు. అయితే ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో మాత్రం ఆ విషయం తెలుస్తుంది. ఆయన వేసే సెటైర్లు వేరే లెవల్లో ఉంటాయి. చాలా మంది పెద్ద వాళ్లు కూడా మహేష్ సెటైర్లపై సరదాగా కామెంట్ కూడా చేశారు. వెటకారంతో కూడిన పంచ్‌లకు ఇతర కో స్టార్స్ కూడా షాక్ అవుతుంటారు. అంతటి స్పాంటినిటీ మహేష్ సొంతం. అయితే చిన్నప్పట్నుంచి మహేష్ చాలాస్పీడ్ అని, ఏదైనా అనుకున్నాడంటే ఆ విషయం చేసి చూపిస్తాడని సూపర్ స్టార్ కృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు. అయితే బాల నటుడిగా ఉన్నప్పుడు బైక్ రైడ్ చేసి ఆశ్చర్యపరిచారట. షూటింగ్ సమయంలో గుంటలపై కూడా ఎలాంటి డూప్‌లేకుండా తనే డ్రైవ్ చేసేవాడని తెలిపారు.
ఇదిలా ఉంటే చిన్నప్పుడు చేసిన మరో అల్లరి పనిని చిన్నాన్న ఆదిశేషగిరి రావు బయటపెట్టారు. మహేష్ ఎంతటి అల్లరిగా ఉండేవాడో తెలిపారు. తన 14 ఏళ్ల వయసులో ఆయన మహేష్ బాబు తన అక్క పద్మ కారు తీసుకుని షికారుకి వెళ్లాడట. అప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. పోలీసులు చిన్నగా ఉన్న మహేష్‌ని గమనించారు. పట్టుకునేందుకు వెంటపడ్డారట. కానీ వాళ్లకి దొరక్కుండా వాళ్ల ఆఫీస్‌లోకి ఫాస్ట్ గా వచ్చేశాడట. ఆఫీస్ వెనకాల కారు పెట్టి, సైలెంట్‌గా లోపలకి వచ్చి బాబాయ్ ఆదిశేషగిరి రావు వద్ద కూర్చున్నాడట.
కానీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. వాళ్ల పద్మాలయ స్టూడియో ఆఫీసుకి వచ్చారు. ఇలా ఎంక్వైరీ చేయగా, మహేష్‌ని చూసి గుర్తుపట్టారట. పోలీసులు నిలదీయగా వాళ్లకి ఆది శేషగిరి రావు ఏదో చెప్పి మ్యానేజ్ చేశాడట. మొత్తానికి అలా మహేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. తన ఆఫీసులో దొరికిపోవడంతో బయటపడ్డాడు. అదే బయట రోడ్లపై దొరికితే పెద్ద రచ్చ అయ్యేదని తెలిపారు ఆదిశేషగిరిరావు. అంతేకాదు ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణకి తెలియకుండా మ్యానేజ్ చేశారట. మొత్తానికి బాబాయ్ వల్ల మహేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు.
మహేష్ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణకి కొడుకుగా, తమ్ముడిగానూ నటించారు. బాలనటుడిగా పలు సినిమాలు చేశాక `రాజకుమారుడు` సినిమాతో హీరోగా మారారు మహేష్ బాబు. తొలి సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్ కాదు. ఆ తర్వాత `మురారి`తో తొలి హిట్‌ని అందుకున్నాడు. `ఒక్కడు` సినిమాతో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయాడు మహేష్ బాబు. `పోకిరి` మూవీ ఆయన్ని సూపర్ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. `దూకుడు`, `శ్రీమంతుడు`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.