టాప్ గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ట్రెండీ వేర్ లో ఎన్టీఆర్ భామ మెరుపులు

First Published | Aug 7, 2023, 8:50 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ గ్యాప్ లో హిందీ చిత్రాలతో బాలీవుడ్ లో సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. 

అయితే, జాన్వీ కపూర్ తన కేరీర్ ను ఆసక్తికరంగా కొనసాగిస్తోంది. ఎక్కడా తొందరపడకుండా ఆచిచూతీ అడుగులేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండి, మంచి పెర్ఫామెన్స్ అందించగల చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో విభిన్న పాత్రల్లోనూ నటిస్తోంది. 


రీసెంట్ గా ‘బావల్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ - జాన్వీ కలిసి నటించారు. గతనెల 21 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలోని తన లుక్స్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

‘బావల్’ మెమోరీస్ అంటూ బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ లో జాన్వీ  స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. డిఫరెంట్ అవుట్ ఫిట్లలో అట్రాక్ట్ చేసింది. కిర్రాక్ గా ఫోజులిస్తూ కట్టిపడేసింది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. 
 

మరోవైపు క్లీవేజ్ షోతో, టాప్ గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాగే సినిమాలోని తన బ్యూటీఫుల్ పాత్రను గుర్తు చేసేలా ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

ఇదిలా ఉంటే.. త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇక హిందీలో ‘మిస్టర్ అండ్ మిస్ ధోనీ’, ‘ఉల్జహ’ చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!