గ్రీన్ శారీలో మంత్రముగ్ధులను చేస్తున్న మలైకా అరోరా.. చీరకట్టులో మెరిసిపోతున్న బాలీవుడ్ నటి

First Published | Aug 7, 2023, 8:10 PM IST

బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా చీరకట్టులో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అభిమానులు, నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది. 
 

బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా (Malaika Arora)  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులతో పాటు యువతను ఉర్రూతలూగించింది. గ్లామర్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లేలా చేసింది. 
 

ఐటెం సాంగ్స్  కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నటిగా, డాన్సర్ గా ఎన్నో చిత్రాలతో అలరించింది. తన అందంతో కట్టిపడేసింది. మంచి ఫాలోయింగ్ ను సాధించుకుంది. 
 


తెలుగు ప్రేక్షకులను మలైకా ‘అతిథి’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్  లో నటించి మెప్పించింది. బ్యూటీఫుల్ గా మెరిసి, అదిరిపోయే డాన్స్ తో అలరించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. 
 

ఇదిలా ఉంటే.. మలైకా సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్  ఇస్తూ వస్తోంది. ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ  తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

ఈ సందర్భంగా తాజాగా మలైకా నెట్టింట బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్లలో, జిమ్ వేర్స్ లో కనిపిస్తూ ఉండేది. త్వరలో ఐదు పదుల వయస్సుకు చేరుకుంటున్నా ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటోంది. 

ఇక తాజాగా మలైకా చీరకట్టులో మెరిసింది. గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. శారీలో చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చి మెస్మరైజ్ చేసింది. లేటెస్ట్ ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!