కూతురు వయసున్న నటితో ఆ కామ వేషాలేంటి?.. చిరంజీవిపై శ్రీరెడ్డి పోస్ట్.. ఉతికి ఆరేస్తున్న మెగా ఫ్యాన్స్

Published : Aug 07, 2023, 08:05 PM IST

ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వివాదాస్పద సంచలన నటి శ్రీరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఆమె చిరంజీవి పెట్టిన పోజులు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మెగా ఫ్యాన్స్ దీనిపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  

PREV
17
కూతురు వయసున్న నటితో ఆ కామ వేషాలేంటి?.. చిరంజీవిపై శ్రీరెడ్డి పోస్ట్.. ఉతికి ఆరేస్తున్న మెగా ఫ్యాన్స్

వివాదాస్పద నటిగా పేరుతెచ్చుకున్న శ్రీరెడ్డి.. గత రెండేళ్ల క్రితం వరకు మెగా ఫ్యాన్స్ ని టార్గెట్‌గా పోస్ట్ లు పెడుతూ, కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచింది. మధ్యలో గ్యాప్‌ ఇచ్చింది. మధ్య మధ్యలో రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి రచ్చ లేపింది. మెగాస్టార్‌ని గెలికింది. దీంతో ఇది పెద్ద దుమారం రేపుతుంది. ప్రస్తుతం మరోసారి శ్రీరెడ్డి వార్తల్లో నిలుస్తుంది. 

27

చిరంజీవి హీరోగా నటించిన `భోళాశంకర్‌` చిత్రంలో కీర్తిసురేష్‌ చెల్లి పాత్ర పోషించింది. తమన్నా కథానాయిక. మెహర్‌ రమేష్‌ రూపొందించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకలో కీర్తిసురేష్‌ గురించి ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. సినిమాలో చేసిన చెల్లి పాత్రని ఈ మూవీకే పరిమితం చేయాలని, మున్ముందు తనతో హీరోయిన్‌గానూ చేయాలని ఆయన కామెంట్‌ చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై కీర్తిసురేష్‌తో కాస్త చిలిపిగా వ్యవహరించారు చిరు. ఇది ఈవెంట్‌లో అందరిని అలరించింది. నవ్వులు పూయించింది. 
 

37

కానీ ఇది వివాదాస్పద నటి శ్రీరెడ్డికి మాత్రం మండేలా చేసింది. దీంతో ఆమె రెచ్చిపోయింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ బోల్డ్ భామ చిరంజీవిపై ఘాటు పోస్ట్ పెట్టింది. కామ వేషాలంటూ రెచ్చిపోయింది. కూతురు వయసున్న నటితో ఆ కామ వేషాలేంటి? అంటూ విమర్శలు గుప్పించింది. కనీసం గద్దర్‌కి మౌనం పాటించలేదని ఆమె మండిపడింది.
 

47

`సినిమాలో చెల్లెలు పాత్ర, నిజ జీవితంలో తన కూతురు వయసున్న కీర్తి సురేష్‌తో లక్షల మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవిగారు, కనీసం గద్దర్‌ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది` అని పేర్కొంది. ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. అంతేకాదు ఈ పోస్ట్ కాస్త మెగా ఫ్యాన్స్ కి చేరింది. దీంతో రచ్చ లేపుతున్నారు. శ్రీరెడ్డిని ఉతికి ఆరేస్తున్నారు. పిచ్చెక్కించే కౌంటర్లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నారు.

57
chiranjeevi, srireddy

`నీకు ఇంకా పచ్చ కామర్లు తగ్గలేదని, ప్రతివ్రత పత్తిత్తు మాటలు అంటూ, అదేదో మీరే పాటించి మీ గౌరవం పెంచుకోమ్మని, ఇలా మెగా ఫ్యాన్స్ కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెంట్‌లో చిరంజీవి మరీ అతి చేశారని, అలా చేయకుండా ఉండాల్సిందని, చూడ్డానికి బాగా లేదని అంటున్నారు. దీనికి నందమూరి ఫ్యాన్స్ చేతులు కలుపుతుండటం గమనార్హం. 

67

శ్రీరెడ్డి నాలుగేళ్ల క్రితం అటు దగ్గుబాటి అభిరామ్‌, ఇటు మెగా ఫ్యామిలీ, పవన్‌ కళ్యాణ్‌ వంటి కొందరు హీరోలను టార్గెట్‌ చేస్తూ అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారని కొందరు పేర్లు కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి. `మా`లో సభ్యత్వం ఇవ్వడం లేదంటూ `మా`అసోసియేషన్‌పై ఆరోపణలు చేశారు. కొన్ని రోజులపాటు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యారు. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు సోషల్‌ మీడియాలో విమర్శలతో రచ్చ చేసింది. క్రమంగా సైలెంట్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోవడం గమనార్హం. 
 

77

ఇదిలా ఉంటే ప్రజా పాటల యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్‌ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయనకు తన సంతాపం తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. `వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం !` అంటూ ఆయన గొప్పతానాన్ని,అనుబంధాన్ని చాటుకున్నారు చిరు. ఇక ఆయన హీరోగా నటించిన `భోళాశంకర్‌`లో తమన్నా కథానాయకగా నటించగా, ఆగస్ట్ 11న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories