Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు

Published : May 30, 2026, 09:07 PM IST

నటి హేమ మరోసారి రాజకీయాలపై తన ఆసక్తిని వెల్లడించింది. మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. మరోవైపు సినిమా అవకాశాలు రావాలని దాసరి వర్థంతి సందర్భంగా తెలిపింది. 

PREV
15
ఆఫర్ల కోసం నటి హేమ ప్లాన్‌

నటి హేమ ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. మంచి కామెడీ పాత్రలతో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా రాణించి మెప్పించింది. ఆద్యంతం అలరించింది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెకి సినిమా ఆఫర్లు లేవు. ఆమె చేయడం లేదా? ఆమెకి రావడం లేదా? ఏం జరుగుతుందో ఏమోగానీ.. హేమ ఇటీవల కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంది. దాసరి నారాయణరావు సమాధి వద్ద తన మనసులో కోరికలను బయటపెట్టింది.

25
దాసరి వర్థంతి సందర్భంగా సమాధిని సందర్శించిన నటి హేమ

దాసరి నారాయణ రావు వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సమాధిని సందర్శించింది నటి హేమ. దాసరి సమాధిని ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం క్లీన్‌ కూడా చేయడం లేదని మంచు మనోజ్‌ వాపోయాడు. ఆయన స్వయంగా వెళ్లి తన మనుషులతో క్లీన్‌ చేయించాడు.  నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నటి హేమ్‌ కూడా అక్కడికి వెళ్లి దాసరి ఆశీస్సులు తీసుకుంది.

35
గురువుగారు ఉంటే నా లైఫ్ మరోలా ఉండేది

ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ, ఈ రోజు గురువుగారి వర్థంతి అనేది కనీసం మైండ్‌లో కూడా లేదు. ఓ వీడియో చూసినప్పుడు అయ్యో ఆయన సమాధి ఇలా ఉందా అనిపించింది. అందుకే కొందరు మనుషులను తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే, అంతా నీట్‌గా బాగా చేసి ఉంది. గురువుగారే మాకు తన వర్థంతిని గుర్తు చేసి తమతో ఇలా చేయించుకున్నారనిపిస్తుంది. గురువుగారు ఉండి ఉంటే నా లైఫ్‌ మరోలా ఉండేది. చనిపోయాక కూడా మాకు గుర్తు చేసి ఇక్కడికి వచ్చేలా చేశారు. గురువుగారు నేను సినిమాల్లో బిజీ కావాలని, మంచి రాజకీయ నాయకురాలిని కావాలని ఆశీర్వదించండి ` అని తెలిపింది హేమ.

45
రాజకీయాలపై నటి హేమ మనసులో మాట

మొత్తంగా తన మనసులో మాటని బయటపెట్టింది హేమ. సినిమా అవకాశాలు లేకపోవడంతో మళ్లీ అవకాశాలు రావాలని తెలిపింది. అదే సమయంలో రాజకీయాల్లో రాణించాలని కోరుకుంది. తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరకని ఆమె వెల్లడించింది. మున్ముందు ఆమె రాజకీయాల్లోకి రాబోతుందనే హింట్‌ ఇచ్చింది హేమ. మరి ఏ పార్టీ వాళ్లు ఆమెకి గాలం వేస్తారో చూడాలి. అయితే గతంలో 2014లోనే రాజకీయాల్లోకి వచ్చింది హేమ. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేసింది. ఓడిపోయింది.

55
వైసీపీలో చేరి రాజకీయాలకు దూరంగా హేమ

ఆ తర్వాత 2019లో టైమ్‌లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపింది. జగన్మోహన్‌రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీలో చేరింది. కొంత కాలం యాక్టివ్‌గా ఉన్న ఆమె ఆ తర్వాత సైలెంట్‌ అయ్యింది. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంది. ఆ మధ్య రీసార్ట్‌ రేవ్‌ పార్టీలో ఆమె పాల్గొన్నట్టు వినిపించింది. దీంతోపాటు పలు వివాదాల్లో ఆమె పేరు వినిపించింది. దీంతో హేమ సినిమాలకు గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తన ప్రయత్నం షురూ చేసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories