డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి అకారణంగా తిట్టిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించడం లేదు అని వినాయక్ తెలిపారు.
ఇటీవల ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల వేడుక ఘనంగా నిర్వహించింది. గద్దర్ అవార్డుల వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు వివాదం అయ్యాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
25
చిరంజీవి కామెంట్స్
కళారులని ప్రోత్సాహించడంలో, చిత్ర పరిశ్రమలోని నటీనటులకు అవార్డులు ఇవ్వడంలో తెలంగాణతో పోల్చితే ఏపీ ప్రభుత్వం వెనుకబడింది అని చిరంజీవి కామెంట్స్ చేశారు. దీనితో కొందరు చిరంజీవి వ్యాఖ్యలని సమర్థించగా.. మరికొందరు తీవ్రంగా తప్పుపట్టారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లే చిరంజీవి వ్యాఖ్యలని వ్యతిరేకించారు.
35
డైరెక్టర్ వివి వినాయక్
దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివి వినాయక్ స్పందించారు. అప్పుడు నంది అవార్డులు అంటే ఎంతో కోలాహలంగా ఉండేది. ప్రతి ఒక్కరూ టీవీల్లో చూసేవారు. నంది అవార్డుల వేడుకలో ఉగాది రోజున ఎంతో అద్భుతంగా జరిగేవి. చిరంజీవి గారు అవార్డులు ఇవ్వమని తన కోసం అడగలేదు. ఇండస్ట్రీ కోసం అడిగారు. చిరంజీవి గారి స్థాయి ఏంటి ? ఆయనకి అవార్డులు అవసరమా ? ఆయన అడిగింది ఇండస్ట్రీ కోసం మాత్రమే. దానిని కూడా తప్పు పడితే ఎలా అని వివి వినాయక్ ప్రశ్నించారు.
చిరంజీవి గారిని ఎవరైనా అకారణంగా తిడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. ఆయన ఏంటో నాకు తెలుసు. మేము తప్పు చేస్తున్నా ఆయన ఊరుకోరు. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి.. ఆయన్ని అకారణంగా తిట్టిన వాళ్లంతా పాడైపోయారు. ఆయన్ని తిట్టిన వాళ్ళు ఇండస్ట్రీలో లేకుండా పోయారు అంటూ వినాయక్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
55
మనం తిడుతున్నాం
చిరంజీవి గారిని ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తులే గౌరవిస్తారు. కానీ మనం తిడుతున్నాం. ఇదేం దౌర్భాగ్యమో అర్థం కావడం లేదు అంటూ వినాయక్ కామెంట్స్ చేశారు.