రెడ్ డ్రెస్ లో హేబా పటేల్ కిర్రాక్ స్టిల్స్.. మత్తు కళ్లతో మైమరిపిస్తున్న కుమారి..

First Published | Aug 23, 2023, 4:28 PM IST

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel)  బ్యూటీఫుల్ లుక్ లో నెట్టింట దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.  తాజాగా రెడ్ డ్రెస్ లో మెరిసింది. బ్యూటీఫుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

నార్త్ బ్యూటీ హేబా పటేల్ కన్నడ చిత్రం ‘అధ్యక్ష’తో తన కెరీర్ ను 2014లో  ప్రారంభించింది. ఆ తర్వాత ఓ తమిళం చిత్రంలో మెరిసింది. అదే ఏడాది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత ‘అలా ఇలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
 

ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేసిన `కుమారి 21ఎఫ్‌`లో సెన్సేషన్ గా మారింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో యువతను ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తోనూ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ హీరోయిన్ గా క్రేజ్ పొందింది.
 


ఆ సినిమా మంచి రిజల్ట్ సాధించడంతో హేబా పటేల్ కు తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కాయి. ‘ఈడోరకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’, ‘మిస్టర్’, ‘24 కిస్సెస్’ ‘ఓరేయ్ బుజ్జి’ వంటి చిత్రాలతో అలరించింది. 
 

ఆ మధ్యలో కాస్తా హేబా పటేల్ జోరు తగ్గింది. మళ్లీ రీసెంట్ గా వరుస చిత్రాలతో అలరిస్తోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రంతో వచ్చి తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

ఈ క్రమంలో సమయం దొరికినప్పుడల్లా హేబా పటేల్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. మరోవైపు అందాల విందుతోనూ అదరగొడుతోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ లెహంగా వోణీలో మెరిసింది. చెమ్కీలతో కూడిన ఆ డ్రెస్ లో కుమారి మెరిసిపోయింది. ఇక కిర్రాక్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తు చూపులతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’, ‘ఆద్య’ సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. రీసెంట్ గా ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

Latest Videos

click me!