80వ దశకంలో అరంగేట్రం..
80వ దశకంలో అరంగేట్రం చేసి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది నటి గౌతమి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన గౌతమి.. డాక్టర్ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ కాగా, తల్లి పాథాలజిస్ట్. ఉన్నత విద్యా నేపథ్యం ఉన్నా, ఆమె ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించింది.