ఛార్మి 30 పైగా తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె సాధించిన హిట్ చిత్రాలు వేళ్ళపై లెక్కపెట్టుకోవచ్చు. మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతి లక్ష్మి లాంటి చిత్రాలు మాత్రమే ఛార్మి విజయాలుగా చెప్పుకోవచ్చు. డ్యాన్స్, యాక్టింగ్, గ్లామర్ విషయంలో ఛార్మి కాంప్రమైజ్ కాకుండా పెర్మార్మెన్స్ ఇస్తుంది. డైరెక్టర్ కృష్ణ వంశీ మూడు చిత్రాల్లో ఛార్మీ కి ఛాన్స్ ఇచ్చారు. చక్రం, శ్రీ ఆంజనేయం, రాఖీ చిత్రాల్లో చార్మీ.. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించింది. వీటిలో రాఖీ మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రం . అది కూడా గొప్ప సక్సెస్ ఏమీ కాదు.