రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Published : Feb 15, 2025, 09:20 AM IST

మాజీ హీరోయిన్, ప్రస్తుత పొలిటీషియన్ రోజా ఓ పాన్ ఇండియా హీరోను ఎత్తుకుని ఆడించారన్న విషయం మీకు తెలుసా..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఆ హీరో ఎవరంటే..?   

PREV
15
రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

రోజ మాజీ హీరోయిన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. ప్రస్తుతం అధికారం కోల్పోయి రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కనిపిస్తుంటుంది. చెన్నైలో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు  రోజా.

త్వరలో సినిమాలు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అని టాక్ వినిపించినా ఇప్పటి వరకూ మాత్రంఏం మూవీకి సైన్ చేసినట్టు కనిపించలేదు. అంతే కాదు జబర్ధస్త్ కు మళ్ళీ వెళ్లాలని ట్రై చేసినా.. వారు తీసుకోలేదు అని సమాచారం. ఇక చిరు, పవన్ ను తిట్టడంతో టాలీవుడ్ లో కూడా రోజాకు ఛాన్స్ లు దొరకడంలేదు అంటున్నారు. 

Also Read: ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఏకైక సినిమా , చీరకట్టి, పూలు కూడా పెట్టిన పెద్దాయన.

25
Actress Roja

ఇది  ఎంత వరకూ నిజమె తెలియదు కాని.. తమిళ సినిమాల్లో కూడా ఆమె ట్రై చేస్తున్నారట. ఇక రజినీకాంత్ ను కూడా వీళ్ళు అధికారంలో ఉండగా తిట్టడంతో అక్కడ కూడా ఛాన్స్ లు రావడంలేదు అని అంటున్నారు. నిజమో కాదో తరువాత సంగతి. కాని రోజా ఒకప్పుడు హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ను ఒక ఊపు ఊపేసింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సుమన్, వినోద్ లాంటి హీరోల వరకూ.. ఆల్ మోస్ట్ స్టార్స్ అందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది. 

Also Read:ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?

35
Roja-Chiranjeevi

అయితే ప్రస్తుతం పాన్ఇండియాను ఊపేస్తున్న ఓ హీరోను అప్పట్లో రోజా ఎత్తుకునిపెంచిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనో తెలుసా..? అతను ఎవరో కాదు రామ్ చరణ్. రామ్ చరణ్ ను షూటింగ్స్ టైమ్ లో ఎత్తుకుని ఆడించేదట రోజా. మరీ ముఖ్యంగా ముఠామేస్త్రీ సినిమా షూటింగ్ టైమ్ లో  సెట్స్ కు రామ్ చరణ్ ఎక్కువగా వచ్చేవాడట. అప్పుడు చాలా చిన్నవాడు కావడంతో బాగా అల్లరి చేసేవాడట. ఈ విషయాన్ని రోజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

Also Read:సమంత ఫోన్ వాల్ పేపర్ పై షాకింగ్ ఫోటో, ఎవరు ఊహించి ఉండరు

45

రామ్ చరణ్ గురించి రోజా మాట్లాడుతూ.. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఎత్తుకొని పెంచాను. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడు. అప్పుడు చాలా అల్లరి చేసేవాడు.  చాలా చిన్నప్పుడు బాగా హుషారుగా ఉండేవారు ఎక్కువ అల్లరి..పట్టుకోలేకపోయాం. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది. అటువంటిది రామ్ చరణ్  RRR చూశాక చాలా గర్వంగా అనిపించింది అన్నారు. 

55

రోజా బేసిక్ గా చిరంజీవి అభిమాని. రాజకీయ విభేదాలు ఉన్నా.. చిరును ఆమె విమర్శించినా.. మెగా ఫ్యామిలీ అంటే ఆమెకు చాలా అభిమానం. అందుకే మినిస్టర్ అవ్వగానే వెళ్లి చిరంజీవిని ఫ్యామిలీతో సహా వెళ్లి కలిశారు రోజా. ఇక లాస్ట్ ఇయర్  రోజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఈ విషయాలు వెల్లడించారు ఫైర్ బ్రాండ్. 
 

Read more Photos on
click me!

Recommended Stories