రాముడిగా కృష్ణుడిగా, దుర్యోధనుడిగా , అర్జునుడిగా, కర్ణుడిగా, వీర బ్రహ్మేంద్రస్వామిగా, వేమనగా, ఆది శంకరుడిగా, రామానుజుడిగా.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే..సీనియర్ ఎన్టీఆర్ చేసినన్న పాత్రలు ఎవరు చేసి ఉండరేమో. అంతే కాదు.. ప్రతీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశాం చేసేవారు. ఎవరికి సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది. అటు మైథలాజికల్ క్యారెక్టర్ లు మాత్రమే కాదు.. ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ .. కమర్షియల్ సినిమాలతో నిర్మాతలకు కాసులు కురిపించారు.