ట్రెడిషనల్ వేర్ లో కేథరిన్ బ్యూటీఫుల్ లుక్.. మిర్రర్ ముందు లేడీ ఎమ్మెల్యే స్టన్నింగ్ స్టిల్స్

First Published | Aug 10, 2023, 5:57 PM IST

యంగ్ బ్యూటీ కేథరిన్ ట్రెసా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. 
 

దక్షిణాదిలోని అన్ని భాషల చిత్రాల్లో కేథరిన్ ట్రెసా (Catherine Tresa)  నటించింది. స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపరంగా మెప్పించింది. మరోవైపు గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గలేదు. ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

కన్నడ చిత్రం ‘శంకర్ ఐపీఎస్’తో కేథరిన్ హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి తెలుగులో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ చిత్రాలకే పరిమితమైంది. ఇక్కడే మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. 
 


తెలుగులో ‘చమ్మక్ ఛల్లో’, ‘ఇద్దరమ్మాయిలతో’, పైసా, ఎర్రబస్సు, రుద్రమాదేవి, సరైనోడు, వంటి చాలా చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ మెరిసింది. అయితే వరుసగా ఫ్లాప్స్ పడుతుండటంతో ఈ బ్యూటీకి కాస్తా ఆఫర్లు తగ్గాయి.
 

దుబాయ్ కి చెందిన కేథరిన్ ట్రెసా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పన్నేండేళ్లకు పైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై మెరుస్తోంది.
 

కేవలం సినిమాలతోనే కాకుండా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కూడా కేథరిన్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా తన బ్యూటీఫుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది. గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

తాజాగా ఈ బ్యూటీ లైట్ పింక్ కలర్ చుడీదార్ లో మెరిసింది. మిర్రర్ ముందు క్యూట్ ఫోజులిస్తూ కట్టిపడేసింది. మత్తుచూపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కేథరిన్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. చివరిగా ‘బింబిసార’ చిత్రంతో అలరించింది. 

Latest Videos

click me!