పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్, తెలంగాణ సీఎస్ కి హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు..ఎందుకంటే

Published : Aug 06, 2025, 11:39 PM IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసు విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ సీఎస్ కి నోటీసులు పంపింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన

2024 డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య 70MM థియేటర్ వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

DID YOU KNOW ?
అల్లు అర్జున్ పుష్ప 2 వసూళ్లు
పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోగా అవతరించారు. 
25
ప్రీమియర్ షోకి హాజరైన అల్లు అర్జున్ 

ఈ ప్రత్యేక ప్రీమియర్ షోకి అల్లు అర్జున్‌ రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చి థియేటర్ వద్ద  గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

35
అల్లు అర్జున్ పై కేసు నమోదు 

ఈ ఘటనలో థియేటర్ మేనేజ్‌మెంట్, అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బందిపై సెక్షన్లు 105, 118(1) కింద కేసులు నమోదు అయ్యాయి. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని గంటల్లోనే బెయిల్పై విడుదల చేశారు. థియేటర్ యజమాని, మేనేజర్ కూడా అరెస్ట్ అయ్యారు. అనంతరం అల్లు అర్జున్, ‘పుష్ప 2’ చిత్ర యూనిట్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

45
మానవ హక్కుల కమిషన్ అసంతృప్తి 

తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోలీసు శాఖ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “నివేదిక ప్రకారం ప్రీమియర్ షోకు పోలీసుల అనుమతి లేదు. అలాంటప్పుడు థియేటర్ వద్దకి అల్లు అర్జున్ ఎలా వెళ్లారు ? అంతమంది ప్రేక్షకులు ఎలా హాజరయ్యారు? సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరగేదా? విచారణ నిష్పక్షపాతంగా సాగాలి. పూర్తి నివేదికను ఆరు వారాల్లోగా సమర్పించాలి” అంటూ NHRC ఆదేశించింది.

55
కేసు మళ్ళీ సీరియస్ అవుతుందా ?

ఇది మాత్రమే కాదు, బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వకూడదు? అనే అంశాన్ని కూడా NHRC ప్రశ్నించింది. పోలీసులు అందించిన నివేదిక విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అసంతృప్తిగా ఉండడంతో ఈ కేసు మళ్ళీ సీరియస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories