రాజమౌళి `మగధీర`కి నో చెప్పి తప్పు చేశా.. నటి అర్చన భావోద్వేగం.. పెద్ద ఆఫర్లు మిస్‌ అయ్యాయంటూ కన్నీళ్లు

Published : Jun 28, 2022, 11:10 PM IST

నటి అర్చన చాలా రోజుల తర్వాత మళ్లీ మెరిశారు. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మిస్‌ అయిన సినిమా అవకాశాల వల్ల తన కెరీర్‌ గాడి తప్పిందని చెబుతూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు.  

PREV
16
రాజమౌళి `మగధీర`కి నో చెప్పి తప్పు చేశా.. నటి అర్చన భావోద్వేగం.. పెద్ద ఆఫర్లు మిస్‌ అయ్యాయంటూ కన్నీళ్లు

`నేను` సినిమాతో తెలుగులో Archana మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను`, `సూర్యం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `శ్రీరామదాసు`, `పౌర్ణమి`, `సామాన్యుడు`, `అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ`, `యమదొంగ`, `పాండురంగడు`, `ఖలేజా`, `పరమవీరచక్ర`, `బలుపు`, `కమలతో నా ప్రయాణం`, `పంచమి`, `లయన్‌` వంటి చిత్రాల్లు చేసింది. హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌ జగదీష్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది. 
 

26

మళ్లీ ఇన్నాళ్లకు మెరిసింది. అలీ హోస్ట్ గా రన్‌ అవుతున్న `అలీతో సరదాగా`(Alitho Saradaga) టాక్‌ షోలో పాల్గొంది. ఇందులో తన భర్త జగదీష్‌తో కలిసి ఆమె మెరిసింది. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది అర్చన. తన భర్త ఎలా కలుసుకున్నారనేది చెప్పింది. `శ్రీరామదాసు` సినిమా చేస్తున్నప్పుడు తన వయసు చాలా చిన్నది అని, సుమన్‌రాముడిగా చేస్తే, ఆయన పక్కన సీతాదేవి నటించానని, అంత బాగా నటించడానికి క్రెడిట్‌ మొత్తం కె.రాఘవేంద్రరావుదే అని చెప్పింది అర్చన. మళ్లీ సినిమా ఎప్పుడు అంటూ రాఘవేంద్రరావుని అడిగింది. 

36

అర్చన, జగదీష్‌ మ్యారేజ్‌ కార్డ్ ప్రింట్‌ అయ్యాక వెన్యూ మారిపోయిందేంటి? అని అలీ అడిగిన ప్రశ్నకి ఆర్చన స్పందిస్తూ, ఇలాంటి కోతి ఐడియాలు, సడెన్‌గా ప్లాన్‌ మార్చే ఐడియాలు ఇద్దరికి ఒకేసారి వస్తాయని, ఆ టైమ్‌లో ఇక్కడే చేసేసుకుందామా? పెళ్లి అని జగదీష్‌ అన్నాడని తెలిపింది. మొత్తంగా తన పెళ్లి వెన్యూ ఎలా మారిపోయిందో వివరించింది. ఇద్దరిలో తనే రొమాంటిక్‌ అని అర్చన చెప్పింది.

46

పెళ్లికి ముందు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి, అట్నుంచి హాస్పిటల్‌కే వెళ్లిపోయావట అని అడగ్గా.. జగదీష్‌ స్పందిస్తూ, పార్టీ కదా నేను ఉన్నాను. నీ ఇష్టం అని చెప్పాడట. కానీ ఆమె కెపాసిటీ తెలియదని, దీంతో పడిపోయిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్‌ చేసి, అక్కడ తనకు అంటాసిడీ ఇచ్చారని తెలిపింది. మరోవైపు బాలయ్యబాబుకి కొరియోగ్రఫీ నేర్పించడం చెబుతూ, బృందావనంలో గోపికలతో డాన్సు చేసే బిట్‌ ఉంటుందని, దాన్ని తనే కంపోజ్‌ చేశానని, అది చూసి బాలయ్యబాబు భలే చేశావని ప్రశంసించినట్టు తెలిపింది అర్చన. 

56

రాజమౌళి సినిమా ఆఫర్‌ కోల్పోవడం గురించి అర్చన చెబుతూ, `యమదొంగ`లో సాంగ్‌ చేశానని, `మగధీర`లో ఓ చిన్న క్యారెక్టర్‌కి తనని అడిగారు. కానీ చేయనని చెప్పాను. తన బ్రెయిన్‌ చిన్నదని, లౌక్యం తక్కువ అని, దీంతో అలా నో చెప్పినట్టు తెలిపింది. అది చేసి ఉంటే తన లైఫ్‌ వేరేలా ఉండేదని పేర్కొంది. నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గానూ అవకాశం వచ్చేదని పేర్కొన్నారు. 

66

సరదా సరదాగా సాగిన టాక్‌ షోలో చివర్లో హీటెక్కించారు అలీ. పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మినిట్‌లో డ్రాప్‌ అయిన సినిమాలేమైనా ఉన్నాయా? అని అలీ అడిగిన ప్రశ్నకి ఎమోషనల్‌ అయ్యింది అర్చన. షోలోనే భర్త ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఎన్నో అవకాశాలు మిస్‌ అయినట్టు చెప్పకనే చెప్పింది. అయితే పూర్తి ఎపిసోడ్‌లో ఈ విషయాలను చెప్పబోతుందని తెలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories