బాలీవుడ్‌ లాంచ్‌కి రామ్‌చరణ్‌ మాస్టర్‌ ప్లాన్‌.. జయాపజయాలకు అతీతంగా నార్త్ ని ఏలేందుకు మెగా హీరో సన్నాహాలు

Published : Jun 28, 2022, 06:15 PM ISTUpdated : Jun 28, 2022, 06:31 PM IST

మెగా పవర్‌ స్టార్‌ కెరీర్‌ విషయంలో సరికొత్త మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా మూవ్‌ అవుతున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి అడుగు మరో మెట్టుకు నాంది కాబోతుంది. సీక్రెట్‌ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు చరణ్‌.   

PREV
18
బాలీవుడ్‌ లాంచ్‌కి రామ్‌చరణ్‌ మాస్టర్‌ ప్లాన్‌.. జయాపజయాలకు అతీతంగా నార్త్ ని ఏలేందుకు మెగా హీరో సన్నాహాలు

రామ్‌చరణ్‌ ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో నార్త్ లోనూ ఆయనకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. పైగా ప్రత్యేకంగా పీఆర్‌ టీమ్‌ని ఏర్పాటు చేసుకుని తనని తాను మార్కెట్‌ చేసుకున్నారు రామ్‌చరణ్. ఇప్పటికీ ఆయన తెలుగులోనే కాదు, సౌత్‌, నార్త్ లోనూ అభిమానులు వరుసగా పోస్ట్ లు పెడుతూ ఆయన ఇమేజ్‌ ఏ స్థాయిలో ఉందో చాటుకుంటున్నారు. 

28

`ఆర్‌ఆర్‌ఆర్‌` తెచ్చిన పాన్‌ ఇండియా ఇమేజ్‌ని మరింత బలంగా విస్తరించుకుంటున్నారు రామ్‌చరణ్‌. అవకాశం వచ్చినప్పుడలా ఏదో రూపంలో నార్త్ లో తిరుగుతూ, అభిమానులకు దగ్గరయ్యేలా చేస్తున్నారు. ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుండటం విశేషం. మరోవైపు ఆయన నార్త్ లోనూ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 

38

బాలీవుడ్‌ లో రీ లాంచ్‌కి మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేసుకుంటున్నారట రామ్‌చరణ్‌. గతంలో ఆయన `జంజీర్‌` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్‌ కాలేదు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పరాజయం చెందడంతో చరణ్‌కి నిరాశ ఎదురైంది. దీంతో ఇప్పుడు మరోసారి అక్కడ పాగా వేయాలని భావిస్తున్నారు. భారీ లాంచ్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో `జంజీర్‌` టైమ్‌లో చేసిన తప్పు మళ్లీ రిపీట్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అప్పుడు ఎలాంటి మార్కెట్‌ లేకుండా బాలీవుడ్‌ సినిమా చేసిన బోల్తా పడిన విషయం తెలిసిందే.

48

అందుకే లాంచ్‌ అవ్వడానికి ముందే తనకు బలమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు చరణ్‌. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో ఓ పాటలో గెస్ట్ గా మెరవబోతున్నారు చరణ్‌. ఇది మాస్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. ఇందులో ఆయన స్టెప్పులు నార్త్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించేలా ఉండేలా కేర్‌ తీసుకుంటున్నారు. మాస్‌ సాంగ్‌కి, డాన్సులకు నార్త్ అడియెన్స్ ఫిదా అవుతుంటారు. సల్మాన్‌ చిత్రంలో అలాంటి స్టెప్పులుండేలా జాగ్రత్త పడుతున్నారట చరణ్‌. 
 

58

మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ ఇమేజ్‌ ఇండియా వైడ్‌ ఉంటుంది. ఆయనది భారీ మార్కెట్‌. ఆయన సినిమాలో చేస్తే కండలవీరుడు మార్కెట్‌ తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆయన చిత్రంలో నటిస్తున్నాడు. ఒకవేళ ఆ సినిమా పరాజయం చెందినా అది చరణ్‌కి ఎఫెక్ట్ కాదు, సాంగ్‌తోనే ఆడియెన్స్ లోకి వెళ్లాల్సినంతగా వెళ్తాడు.

68

దీంతోపాటు అమీర్‌ ఖాన్‌ కి కూడా దగ్గరవుతున్నారు చరణ్‌. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తోపాటు అమీర్‌ని కూడా తన ఇంటికి ఆహ్వానించారు చరణ్‌, ఉపాసన జంట. ప్రత్యేకంగా లంచ్‌కి మిస్టర్‌ పర్‌ఫెక్ట్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉపాసన పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇలా అటు సల్మాన్‌, ఇటు అమీర్‌ మార్కెట్లు నార్త్ లో బలమైనవనే విషయం తెలిసిందే. అవి తనకు కలిసొచ్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు చెర్రి. 
 

78

అయితే గతంలో మెగాస్టార్‌ చిరంజీవి హిందీలో సినిమాలు చేశారు. కానీ అక్కడ సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో తెలుగుకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సినిమా భాషలు దాటుకుని పాన్‌ ఇండియా అనే ఇమేజ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిరు కోరికని చరణ్‌ తీర్చబోతున్నట్టు, తండ్రి చేయలేనిది, తాను చేసి చూపించాలని చెర్రి భావిస్తున్నారట. 

88

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో `ఆర్‌సీ15`లో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమా ఆయన మార్కెట్‌ని మరింత పెంచుతుంది. అదే సమయంలో గౌతమ్‌ తిన్ననూరితోనూ ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా పాన్‌ ఇండి మూవీనే. ఈ రెండు చిత్రాలతో మరింతగా నార్త్ ఆడియెన్స్ లోకి వెళ్తారు చరణ్‌. అనంతరం డైరెక్ట్ ఓ బాలీవుడ్‌ మూవీ చేయాలనుకుంటున్నారట. దానికోసం ముందస్తుగా ఇవన్నీ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్‌ లాంచ్‌ భారీగా ఉండేలా సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమచారం. మరి ఈ విషయంలో చరణ్‌ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories