గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతున్న అను ఇమ్మాన్యుయెల్.. చీరకట్టులో బన్నీ హీరోయిన్ ఎంత అందంగా ఉందో.. పిక్స్

First Published | Jun 13, 2023, 8:47 PM IST

యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)  తాజాగా చీరకట్టులో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. లేటెస్ట్ పిక్స్  ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. 
 

బ్యూటీఫుల్ అండ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 
 

ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. 
 


అను ఇమ్మాన్యుయేల్ తొలత బొద్దుగా ఉండేది. ఇటీవల స్లిమ్ గా తయారై మరింత అందాన్ని సొంతం చేసుకుంది. నాజుగ్గా తయారవడంతో అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. నయా లుక్స్ తో నెట్టింట సందడి చేస్తోంది. 

అయితే, ఎప్పుడూ ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మాత్రం చీరకట్టులో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో అను ఇమ్మాన్యుయేల్ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. గ్రీన్ శారీలో మెరిసిపోయింది. బొట్టుపెట్టుకొని, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్  ధరించి ఆకట్టుకుంది. 
 

చాలా రోజుల తర్వాత అను ఇమ్మాన్యుయేల్ చీరకట్టులో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశాన్ని ఎత్తుతున్నారు. నెటిజన్లు కూడా తన అందమైన లుక్ పై కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

అల్లు శిరీష్ సరసన ‘ఉర్వశీవో రాక్షసివో’ చిత్రంలో నటించిన తర్వాత మాస్ రాజా సరసన ‘రావణసుర’లో గ్లామర్ రోల్ మెరిసింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన ‘జపాన్’లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. 

Latest Videos

click me!