ఆ రెండు కండిషన్స్ కి ఒప్పుకుంటేనే పెళ్లి... వరుణ్ కి గట్టిగా చెప్పిన లావణ్య త్రిపాఠి!

Published : Jun 13, 2023, 06:58 PM IST

లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లకు సగం పెళ్ళైపోయినట్లే. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక ముగిసింది. కాగా వరుణ్ ని భర్తగా చేసుకునేందుకు లావణ్య రెండు కండిషన్స్ పెట్టిందట. 

PREV
15
ఆ రెండు కండిషన్స్ కి ఒప్పుకుంటేనే పెళ్లి... వరుణ్ కి గట్టిగా చెప్పిన లావణ్య త్రిపాఠి!
Varun Tej - Lavanya Tripathi engagement

జూన్ 9న  నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుక జరిగింది. వరుణ్-లావణ్య ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం పూర్తి చేశారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తో పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

25

 గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అధికారిక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి వరుణ్ ని పెళ్లి చేసుకునేందుకు రెండు కండిషన్స్ పెట్టారట. ఆ షరతులకు ఒప్పుకుంటేనే వివాహం అన్నారట.

35

లావణ్య ప్రొఫెషనల్ డాన్సర్. ఆమెకు భరతనాట్యం అంటే ప్రాణం. పెళ్లయ్యాక కూడా డాన్స్ మానను అన్నారట. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తే అనుమతి ఇవ్వాలని కోరారట. ఆ విషయంలో స్వేచ్ఛను ఇవ్వాలన్నారట. 
 

45

రెండో కండీషన్ గా నటనకు గుడ్ పై చెప్పినప్పటికీ చిత్ర నిర్మాణంలో ఉంటాను అన్నారట. నిర్మాతగా తన అభిరుచికి మేర చిత్ర నిర్మాణం చేపడతాను అన్నారట. అందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారట. ఈ రెండు కండిషన్స్ కి ఒప్పుకున్న పక్షంలో మాత్రమే పెళ్లి అని గట్టిగా చెప్పారట. వరుణ్ కుటుంబ సభ్యులు సరే అన్నారట.

55
Varun Tej - Lavanya Tripathi engagement

అదే సమయంలో లావణ్యకు కూడా నాగబాబు ఫ్యామిలీ కండీషన్ పెట్టారట. ఇకపై హీరోయిన్ గా నటించేందుకు వీలు లేదన్నారట. నటనకు గుడ్ బై చెప్పాలన్నారట. అందుకు లావణ్య సరే అన్నారట. అలా ఇరువురి మధ్య ఫెయిర్ డీల్ జరిగిందని అంటున్నారు. 
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్,  

click me!

Recommended Stories