కాన్ ఫెస్టివల్ లో స్టైలిష్ వేర్ ధరించి అట్రాక్ట్ చేస్తున్న దీపికా.. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది..

Published : May 21, 2022, 02:26 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) గ్లోబల్ ఈవెంట్ కాన్ ఫిలిం ఫెస్టివల్ లో తన ఫ్యాషన్ సెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ట్రెండీ సూట్ లో స్టైలిష్ పోజులతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

PREV
16
కాన్ ఫెస్టివల్ లో స్టైలిష్ వేర్ ధరించి అట్రాక్ట్ చేస్తున్న దీపికా.. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఫ్యాషన్ సెన్స్ గ్లోబల్ ఈవెంట్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. రోజుకో అవుట్ ఫిట్స్ లో మతిపోగొడుతోంది. గత ఐదురోజులుగా ఫ్రాన్స్ లో నిర్వహిస్తున్న చిత్రోత్సవ వేడుకకు హాజరైన దీపికా అందరిచూపును తనవైపు తిప్పుకుంటోంది.
 

26

2017 నుంచి కాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోందీ బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone). ఇటీవల ఫ్రాన్స్ లో ప్రారంభమైన 75వ వార్షిక కాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 
 

36

ఈ గ్లోబల్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని  కేన్స్‌ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ లో బ్రహ్మండగా నిర్వహిస్తున్నారు. ఈవెంట్ కు ప్రపంచంలోని పేరుగాంచి స్టార్స్ హాజరై కనువిందు చేస్తున్నారు. అయితే ఈ ఫెస్టివల్ కు జూరీ మెంబర్ హాజరైన దీపికా తన ఫ్యాషన్ వేర్స్ తో ఆకట్టుకునే పనిలో పడింది.
 

46

ఫెస్టివల్‌లో తొలిరోజు  రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా జ్యూరీ డిన్నర్‌కు హాజరయ్యారు. జ్యూరీ సభ్యులలో ఒకరిగా అక్కడికి వెళ్లిన ఆమె తన సీక్విన్డ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. అట్రాక్టివ్ దుస్తుల్లో కనిపించడంతో ఆ కార్యక్రమంలో అట్రాక్షన్ గా నిలిచింది.
 

56

ఆ తరువాత భారతీయ సంప్రదాయ దుస్తుల్లో దీపికా జూరీ సభ్యులు, అతిథుల మధ్య ఉండటంతో మరింత అందంగా కనిపించింది. భారతీయతను చాటేలా చీరకట్టుతో అందరి అటెన్షన్ డ్రా చేసిందీ ముద్దుగుమ్మ. తాజాగా బ్లాక్ ట్రెండీ సూట్ లో అదరగొట్టిందీ బ్యూటీ. అక్కడి సుమద్ర తీరాన  బీచ్ వద్ద సూపర్ సూపర్ స్టైలిష్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తోంది. మెడలో ధరించి స్నేక్ ఆకారంలో ఉన్న ఆర్నమెట్ మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.
 

66

దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్ లో తిగులేని హీరోయిన్ గా దూసుకెళ్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. చివరిగా ‘గెహ్రైయాన్’ చిత్రంలో బోల్డ్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి ‘పఠాన్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో కలిసి ‘ప్రాజెక్ట్ కే’లో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories