Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ దక్కించుకున్న ఈ భామ.. ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది.
ఐశ్వర్య రాజేష్.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని.. ఆపై టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి.. ఇక్కడ కూడా వరుస హిట్స్ కొడుతోంది. ఈ ముద్దు గుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.
25
తమిళంలో ఎన్నో చిత్రాలు..
తమిళంలో చాలానే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది ఐశ్వర్య రాజేష్. ముఖ్యంగా హీరో శివ కార్తికేయన్ నిర్మించిన 'కౌసల్య కృష్ణమూర్తి'.. హీరోయిన్‌గా ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా అటు తమిళంలో.. ఇటు తెలుగులోనూ మంచి హిట్ దక్కించుకుని.. ఆమెకు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టింది.
35
సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్‌గా ఆఫర్లు..
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. ఏకంగా రూ. 300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రజెంట్ అటు తమిళం.. ఇటు తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది ఐశ్వర్య రాజేష్.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూ.. తమ సినిమాల అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
55
పక్కోడి జీవితం ఎందుకు బాసూ..
తాజాగా ఐశ్వర్య రాజేష్.. బ్లూ కలర్ డ్రెస్‌లో ఓ వీడియో షేర్ చేసింది. దానికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇక అది కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘మీ సమయం పరిమితం, కాబట్టి వేరొకరి జీవితాన్ని గడుపుతూ దాన్ని వృధా చేయకండి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.