Prabhas ఇప్పుడు చేస్తున్నాడు, కానీ 20 ఏళ్ల క్రితమే రజనీకాంత్‌ సంచలనం.. డార్లింగ్‌కి వర్కౌట్‌ అవుతుందా?

Published : Dec 31, 2025, 10:49 AM IST

ప్రభాస్‌ ఇప్పుడు హర్రర్ కామెడీ నేపథ్యంలో `ది రాజాసాబ్‌` మూవీ చేశారు. కానీ ఇరవై ఏళ్లక్రితమే రజనీకాంత్‌ ఆ సాహసం చేశారు. బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టించారు. 

PREV
15
ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ ప్రభాస్‌

ప్రభాస్‌ ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని మించిన స్టార్‌ లేడనేది అందరు ఒప్పుకునే నిజం. కానీ ఇరవై ఏళ్ల క్రితం లెక్కలు వేరు. సౌత్‌లో రజనీకాంత్‌, చిరంజీవి, నార్త్ లో అమితాబ్ బచ్చన్‌ అనేలా ఉండేది. వాళ్లు సృష్టించిన సంచలనాలు అలాంటివి. కమర్షియల్‌ సినిమాలు బాక్సాఫీసుని షేక్‌ చేసిన హీరోలు వీరు. ఇప్పుడు ఓ వైపు ప్రయోగాలు, మరోవైపు కమర్షియల్‌ చిత్రాలు, ఇంకోవైపు మైథలాజికల్‌ మూవీ చేస్తూ రాణిస్తున్నారు ప్రభాస్‌. తనకు సెట్‌ కానీ జోనర్‌ లేదని చాటి చెబుతున్నారు.

25
`ది రాజా సాబ్‌`తో రాబోతున్న ప్రభాస్‌

అందులో భాగంగానే ఇప్పుడు `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది హర్రర్‌ ఫాంటసీ మూవీ. కామెడీ మేళవింపుతో దర్శకుడు మారుతి ఈ మూవీని రూపొందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సుమారు రూ.300కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్ర పోషించారు. సినిమా పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతుంది. ఓ రకంగా సంక్రాంతి పండగని ముందే తీసుకురాబోతుంది.

35
ప్రభాస్‌ చేసిన తొలి హర్రర్‌ మూవీ `ది రాజాసాబ్‌`

అయితే ప్రభాస్‌ చేస్తోన్న తొలి హర్రర్‌ కామెడీ చిత్రమిది. ఫాంటసీ ఎలిమెంట్లని జోడించి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. విజువల్స్ పరంగా, గ్రాండియర్ పరంగా ఈ మూవీ హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీజర్‌, ట్రైలర్లు చూసినప్పుడు సినిమా రేంజ్‌ ఏంటో అర్థవుతుంది. విజువల్స్ పరంగా ఎంత గ్రాండియర్ గా ఉందో తెలుస్తోంది. అదే సమయంలో ఇందులో ప్రభాస్‌ లుక్‌, ఆయన పాత్రలోని ట్విస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు. ఒక యాక్షన్‌ హీరో దెయ్యంగా మారడం ఇందులో హైలైట్‌గా నిలవబోతుందనిపిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చివర్లో డార్లింగ్‌ లుక్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.

45
`చంద్రముఖి`తో ట్రెండ్‌ సెట్ చేసిన రజనీకాంత్‌

ఇదిలా ఉంటే ఇండియా టాప్‌ హీరో ప్రభాస్‌ ఇప్పుడు మొదటి సారి హర్రర్‌ కామెడీ మూవీ చేస్తే, సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇరవై ఏళ్ల క్రితమే చేశారు. ఆయన 2005లో `చంద్రముఖి` చిత్రంలో నటించారు. ఇదే జోనర్‌లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా, ప్రభు, జ్యోతిక, వడివేలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అప్పట్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అత్యధిక రోజులు థియేటర్లలో ప్రదర్శించిన తమిళచిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఆ సమయంలో రజనీకాంత్‌ కెరీర్‌ పీక్‌లో ఉంది. అలాంటి సమయంలో ఇలాంటి సాహసం చేశారు రజనీ. అది బాక్సాఫీసు వద్ద వర్కౌట్‌ అయ్యింది.  ఇలాంటి హర్రర్‌ కామెడీ చిత్రాలకు `చంద్రముఖి` ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవడం విశేషం.

55
రజనీ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయితే ప్రభాస్‌ సంచలనం

ఇప్పుడు ప్రభాస్‌ కెరీర్ కూడా పీక్‌లో ఉంది. బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో డార్లింగ్‌ సాహసం చేశారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. అప్పుడు రజనీకాంత్‌కి `చంద్రముఖి` వర్కౌట్‌ అయినట్టుగానే ఇప్పుడు ప్రభాస్‌కి `ది రాజాసాబ్` వర్కౌట్‌ అయితే ఇక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఇది రెండు వేల కోట్ల కలెక్షన్లు దాటినా ఆశ్చర్యం లేదు. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో, ఆ మ్యాజిక్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories