బ్యూటీఫుల్ గౌన్ లో అట్రాక్ట్ చేస్తున్న డస్కీ బ్యూటీ.. చిలిపి నవ్వుతో మైమరిపిస్తున్న ఐశ్వర్య రాజేశ్..

First Published | Jun 8, 2023, 8:03 PM IST

తమిళ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). ప్రస్తుతం కోలీవుడ్, మలయాళంలో  అరడజన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. 
 

టాలెంటెడ్ హీరోయిన్, డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh)  తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తెలుగు బ్యూటీ అయినప్పటికీ తమిళ హీరోయిన్ గా కోలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళం, మలయాళంలో అరడజన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 
 

మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా టాలీవుడ్ లోనూ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. రీసెంట్ గా తెలుగు సినిమాల్లో అవకాశాలపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తను నటించిన ‘ఫర్హానా’ చిత్రం విడుదల కావడంతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. 


అయితే,  ఐశ్వర్య రాజేశ్ వరుస చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యూటీఫుల్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను  అట్రాక్ట్ చేస్తోంది.

గ్లామర్ షోకు చాలా దూరంగా ఉంటుంది ఐశ్వర్య రాజేశ్. సంప్రదాయ దుస్తుల్లోనే ఎప్పుడూ మెరిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ లోనే ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ  అట్రాక్టివ్ గౌన్ లో చూపుతిప్పుకోకుండా చేసింది. అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంది. 

తాజాగా ఐశ్వర్య పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అదిరిపోయే గౌన్ లో డస్కీ బ్యూటీ ఆకర్షించింది. బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. క్యూట్ ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఫ్యాన్స్,, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ గా మారుస్తున్నారు. 
 

ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం  చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధృవ నక్షత్రం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మలయాళం, తమిళంలో కలిసి మొత్తం ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అవన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. 

Latest Videos

click me!