చుడీదార్ లో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ఎంత ముద్దుగా ఉందో.. కోలీవుడ్ లో సందడి చేస్తున్న యంగ్ బ్యూటీ

First Published | Jun 8, 2023, 5:28 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)  బ్యూటీఫుల్ లుక్ తో  కట్టిపడేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో యంగ్ హీరోయిన్ చూడసక్కగా మెరిసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. 
 

సంప్రదాయ దుస్తుల్లో ఈషా రెబ్బా ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో తెలిసిందే. ఈ యంగ్ బ్యూటీ మొన్నటి వరకు ట్రెండీ అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ వచ్చింది. గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. 
 

కానీ కొద్దిరోజులుగా సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనమిస్తోంది. గ్లామర్ షోకు దూరం అన్నట్టుగా ఫొటోషూట్లు చేస్తోంది. పద్ధతిగా ట్రెడిషనల్ వేర్ లో ఫ్యాన్స్ ను పలకరించింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 


తాజాగా ఈషా రెబ్బా పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు అమ్మాయి అయిన ఈషా చుడీదార్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది.  నార్మల్ గా కనిపిస్తున్న తన రూపసౌందర్యంతో ఆకట్టుకుంది. 
 

బ్యూటీఫుల్ స్మైల్, అట్రాక్ట్ చేసే చూపులతో నెటిజన్లను ఫిదా చేసింది. క్యూట్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఈ ముద్దుగుమ్మకు నెటిజన్లు కూడా మంచి మద్దతు ఇస్తున్నారు. తన పోస్టులను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు.
 

లేటెస్ట్ ఫొటోలను కూడా లైక్స్ తో వైరల్ గా మారుస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఈ ఫొటోలకు ‘కలర్ ఫొటో’ హీరోయిన్ చౌదిని చౌదరి కూడా లైక్ చేసింది. 
 

తమిళంలో మరో సినిమాను ప్రారంభించిన సందర్భంగా ఇలా పద్ధతిగా రెడీ అయ్యింది. తన బ్యూటీఫుల్ లుక్ తో అందరినీ కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో 12 ఏళ్లుగా హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నించింది. కానీ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయింద.ి దీంతో గతేడాది నుంచి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తెలుగులో వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 
 

తాజాగా ఓ చిత్రం ప్రారంభం కాగా.. ప్రస్తుతం తమిళంలో ‘ఆయిరం జెన్మంగల్’లో నటిస్తోంది. కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అలాగే సుధీర్ బాబు సరసన తెలుగులో ‘మామ మశ్చీంద్ర’లోనూ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!