మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్లు.. ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ కపుల్ కాబోతున్నారు. జూన్ 9న శుక్రవారం రోజు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి అధికారిక ప్రకటన వచ్చేసింది. దీనితో మెగా ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.