12 సెకండ్లకి 3 కోట్లు, ప్రమోషన్స్ కోసం 50 కోట్లు..ప్రభాస్ కల్కి టీమ్ ఇంత డబ్బు ఎందుకు వృధా చేస్తున్నారు

First Published May 22, 2024, 5:53 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గరపడుతోంది. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గరపడుతోంది. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ప్రచార కార్యక్రమాలు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. 

కల్కి చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్ ని ఆడియన్స్ రీచ్ అయ్యేలా చిత్ర యూనిట్ కష్టపడుతోంది. కాగా నేడు బుజ్జి టీజర్ లాంచ్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కారు అది. బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఈవెంట్ కోసమే 3 నుంచి 4 కోట్ల వరకు చిత్ర యూనిట్ ఖర్చు చేస్తోందట. ఓవరాల్ గా కల్కి చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసే మొత్తం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగలసిందే. ఏకంగా 50 కోట్ల బడ్జెట్ ని కల్కి నిర్మాతలు కేవలం ప్రమోషన్స్ కోసమే వెచ్చిస్తున్నారు. మూవీ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 600 కోట్లు దాటిపోయిందని సమాచారం. 

ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇదే అని అంటున్నారు. ఈ లెక్కన బడ్జెట్ తిరిగి రావాలంటే ప్రభాస్ క్రేజ్ తో పాటు ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి చేరువ కావలసిన అవసరం ఉంది. అందుకే ఐపీఎల్ సమయంలో చిత్ర యూనిట్ 12 సెకండ్ల యాడ్ కోసం స్టార్ స్పోర్ట్స్ లో ఏకంగా 3 కోట్లు వెచ్చించారు. ఆ యాడ్ ద్వారా చిత్ర యూనిట్ 10 కోట్ల వరకు వ్యూస్ పొందినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంపై బజ్ పెంచడం మాత్రమే ప్రమోషన్స్ లక్ష్యం కాదు.. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూసేలా కల్కి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ కోసమే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

మహాభారతం సమయం నుంచి కలియుగంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఉపయోగించే కారు పేరు బుజ్జి. బుజ్జి పాత్ర కథలో చాలా కీలకం అట. ఈ కారు అలాంటి ఇలాంటి కారు కాదు.. నేలపై వేగంగా ప్రయాణించడమే కాదు.. అంతరిక్షంలోకి కూడా దూసుకుపోగలదు. తెలివిగా ఆలోచించగలదు. ఇంకా బుజ్జిలో చాలా విశేషాలు ఉన్నాయట. 

click me!