Sriman: శ్రీనివాస రెడ్డి అలియాస్ శ్రీమన్.. తెలుగోడినే, కానీ నా పేరు కూడా ఎవరికీ తెలియదు..నటుడు ఎమోషనల్

Published : Jul 04, 2026, 06:56 PM IST

ప్రముఖ నటుడు శ్రీమన్ తెలుగులో అద్భుతమైన అవకాశం అందుకున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో శ్రీమన్ అవకాశం అందుకున్నారు. 

PREV
15
Sriman

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ దక్కితే ఒక సూపర్ హిట్ మూవీ ఖాతాలో పడిపోయినట్లే అని నటీనటులు ఇటీవల భావిస్తున్నారు. వినోదంతో మ్యాజిక్ చేసి ఆ చిత్రాన్ని అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించాయి.

25
వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీలో శ్రీమన్ కి ఛాన్స్

ఇప్పుడు అనిల్ రావిపూడి.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు శ్రీమన్ కి అవకాశం దక్కింది. ప్రస్తుతం హైదరాబాద్ లో శ్రీమన్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తన సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రీమన్ తమిళంలో కాంచన సిరీస్ తో పాటు అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. శ్రీమన్ ఎక్కువగా తమిళ సినిమాలు చేయడం వల్ల అతడిని అంతా తమిళ వ్యక్తి అని అనుకుంటారు.

35
శ్రీమన్ తెలుగువాడే, అసలు పేరు ఇదే

కానీ శ్రీమన్ పక్కాగా తెలుగువాడు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడాడ గ్రామం శ్రీమాన్ సొంతూరు. శ్రీమాన్ అసలు పేరు కర్రి శ్రీనివాస రెడ్డి. తమిళంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక స్క్రీన్ నేమ్ శ్రీమన్ అని పెట్టుకున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత ఒక క్రేజీ ఆఫర్ రావడంతో శ్రీమన్ ఎమోషనల్ అయ్యారు. వారిసు మూవీ సమయంలో దిల్ రాజు ద్వారా అనిల్ రావిపూడి గారితో పరిచయం ఏర్పడింది.

45
అనిల్ రావిపూడితో పరిచయం

అనిల్ రావిపూడి గారి సినిమాలు ప్రతి ఒక్కటీ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఫన్ ఎక్కువగా ఉంటుంది. వారిసు టైంలో మిమ్మల్ని ఒకసారి మీట్ కావొచ్చా అని అనిల్ గారిని అడిగాను. ఆఫీస్ కి రమ్మన్నారు. నటుడిగా నేనంటే కూడా ఆయనకు ఇష్టం. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఆయనకు కూడా తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని ఉంది. కానీ పైకి చెప్పలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. వెంకటేష్ సార్, కళ్యాణ్ రామ్ సార్ ఇద్దరితో కలసినటించే ఛాన్స్ రావడం నా అదృష్టం.

55
తెలుగువాళ్ళకు నా పేరు తెలియదు

అంతకు ముందు వరకు నన్ను ఒక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తూ వచ్చారు. ఎక్కడైనా కనిపిస్తే సార్ సెల్ఫీ ప్లీజ్ అని అడిగేవారు. మీ సినిమాలు చూస్తాం సార్.. కానీ మీపేరు ఏదో గుర్తుకు రావడం లేదు అని చెప్పేవారు. అది నా హృదయంలో బాగా గుచ్చుకుంది. నేను తెలుగువాడిని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నా పేరు కూడా తెలియదు.. వాళ్లకు నా నేమ్ రిజిస్టర్ కాలేరు అని బాధపడేవాడిని. ఈ సినిమాతో ఆ బాధ తొలగిపోయి నన్ను శ్రీమన్ గా తెలుగు ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు అని శ్రీమన్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories