Samantha New Project: ప్రెగ్నెన్సీలోనూ సమంత డేర్‌ స్టెప్‌, ఓటీటీకి గ్రీన్‌ సిగ్నల్‌.. ఏం చేయబోతుందంటే?

Published : Jul 04, 2026, 04:28 PM IST

Samantha New Project: సమంత ఇటీవలే `మా ఇంటి బంగారం` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పుడు మరో కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. తాజాగా దీన్ని అధికారికంగా ప్రకటించారు. 

PREV
13
మా ఇంటి బంగారంతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న సమంత

సమంత మూడేళ్ల గ్యాప్‌తో వచ్చి అదిరిపోయే హిట్‌ కొట్టింది. `మా ఇంటి బంగారం`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వంద కోట్లకు దగ్గరలో ఉంది. లాంగ్‌ రన్‌లో వంద కోట్లకు వెళ్లే అవకాశం ఉంది. అయితే మొన్ననే తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. మళ్లీ తాను గ్యాప్‌ తీసుకోబోతున్నట్టు తెలిపింది. మరో రెండేళ్ల వరకు సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్టు చెప్పింది. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆమె మరో ప్రాజెక్ట్ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

23
ప్రెగ్నెన్సీలోనూ సమంత డేర్‌ స్టెప్‌

సోనీలివ్‌లో ఓ ప్రాజెక్ట్ చేయబోతుందట. తాజాగా సోనీలివ్‌ టీమ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సమంత మరో అద్బుతమైన ఛాన్స్ ని కొట్టేసిందట. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు. అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన‌ సోనీ లివ్ త‌మిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు.

33
సమంత టాక్‌ షో చేస్తుందా?

ఒక వైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త‌ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. త‌మిళ్‌లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ప్రాజెక్ట్‌ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ కొత్త‌ ప్రాజెక్ట్ గురించి సమంత త‌న సోష‌ల్ మీడియాలో విష‌యాన్ని పోస్ట్ చేస్తూ.. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై వ‌ర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. మరి  సమంత ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక టాక్‌ షో లాంటిది ప్లాన్‌ చేస్తుందట. తెలుగులో గతంలో సమంత `ఆహా` కోసం సామ్ జామ్‌ అనే టాక్‌ షోని చేసింది. మరి ఇప్పుడు చేసేది కూడా అలాంటిదేనా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories