సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగించాలని చెప్పిన శివకార్తికేయన్, ముఖ్యంగా ట్విట్టర్‌ను వాడకపోవడం మంచిదని, తన అనుభవం నుంచి చెబుతున్నానని అన్నారు. నా మాటలు చూసి ఎలాన్ మస్క్ నా ట్విట్టర్ ఖాతాను నిలిపివేసినా నాకు బాధ లేదు. అది నాకు దక్కిన మొదటి విజయంగానే భావిస్తాను అన్నారు యంగ్ హీరో.
ఇక సోషల్అ మీడియా విషయంలో తన అభిమానులకు సలహా ఇచ్చారు. శివకార్తికేయన్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటించనున్న మరో మూడు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.