Venkatesh: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నట్టే.. డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. అందులో వెంకటేష్ సినిమావల్ల కోలుకోలేని దెబ్బతిన్న మహేష్ బాబు సినిమా గురించి మీకు తెలుసా?
టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడు బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమా కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ బాక్సాఫీస్ వద్ద గట్టి దెబ్బ తినాల్సి వచ్చిందని మీకు తెలుసా? మహేష్ కెరీర్లోనే అంతగా గుర్తుండిపోయే సినిమా కాని ఈ మూవీకి వరుసగా ఎదురైన పోటీ దెబ్బ మీద దెబ్బ కొట్టింది.
మహేష్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే ఆయనకు పూర్తి స్థాయి మాస్ హీరో గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘ఒక్కడు’ సినిమా. అంతకు ముందు ‘వంశీ’, ‘టక్కరి దొంగ’ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మహేష్‌ను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా ఒక్కడు.
అయితే సూపర్ స్టార్ తనకెరీర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే అందుకు ముందు మాత్రం వీరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అందులో మహేష్ బాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏవో కాదు మహేష్ బాబు వంశీ సినిమాపై వెంకటేష్ జయం మనదేరా మూవీ. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి గెలిచింది.
24
నమ్రతకు నచ్చని మహేష్ సినిమా
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ప్రేమకు కారణమైన సినిమా ‘వంశీ’. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అయితే ఈ చిత్రం తనకు ఏమాత్రం నచ్చలేదని నమ్రత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. కథలోనే లోపాలు ఉన్నాయని దర్శకుడు బి. గోపాల్ సైతం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల సమయంలో ఎదురైన పోటీ కూడా దాని ఫలితాన్ని ప్రభావితం చేసింది.
34
వెంకటేష్ జయం మనదేరా తో గట్టి దెబ్బ
‘వంశీ’ విడుదలైన కొద్ది రోజుల్లోనే విక్టరీ వెంకటేష్ నటించిన ‘జయం మనదేరా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన నటనకు మంచి స్పందన లభించడంతో సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటికే ప్లాప్ టాక్ తో.. నడుస్తున్న వంశీకి జయం మనదేరా రూపంలో మరో గట్టి పోటీ ఎదురైంది. ఈ చిత్రం అప్పట్లో సుమారు రూ.12 కోట్ల షేర్ వసూలు చేయడంతో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వంశీ సినిమాకు మరిన్ని కష్టాలు తప్పలేదు.
ఇదే సమయంలో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ సినిమా కూడా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇండస్ట్రీ హిట్ స్థాయిలో దూసుకెళ్లిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో వంశీ సినిమా పూర్తిగా వెనుకబడిపోయింది. ఇలా వరుసగా రెండు విజయవంతమైన సినిమాల పోటీ మహేష్ మూవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. మహేష్, నమ్రత జంటగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించారు. అయినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.