Actor Sivaji: కావాల్సిన వాళ్లే కుట్ర చేశారు, సినిమాలైనా వదిలేస్తా కానీ.. శివాజీ వ్యాఖ్యలు వైరల్

Published : Dec 27, 2025, 06:03 PM IST

నా వ్యాఖ్యల తర్వాత కొందరు మీటింగ్‌ పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. నాకు కావాల్సిన వాళ్లే కుట్ర చేశారు అంటూ తాజాగా శివాజీ వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
నటుడు శివాజీ కామెంట్స్ వైరల్ 

 ప్రముఖ నటుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల దుస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల మంటలు ఇంకా చల్లారలేదు. వివాదం రగులుతూనే ఉంది. శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళ కమిషన్ ఆయనకి నోటీసుకు ఇచ్చింది. దీనితో తాజాగా శివాజీ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. 

25
మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ 

మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు శివాజీ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ మీడియాతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలని నేను గౌరవిస్తాను. కొందరు నువ్వెంత నీ బ్రతుకెంత అని మాట్లాడుతున్నారు. వాళ్ళ బెదిరింపులకు నేను భయపడను. అసలు నేనేం తప్పు చేశానని ఇంత కోపం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. 

35
ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకేంటి ?

 మీ ఇంట్లో మీ అమ్మ నాన్న జాగ్రత్త చెప్పరా ? ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకేంటి ? ఇంతకు ముందు ఎవరూ బట్టల గురించి నాలా మాట్లాడలేదా ? అప్పుడు కూడా వారిని ఇలాగే చేశారా అని శివాజీ ప్రశ్నించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డవారి తరుపున మహిళా కమిషన్ ప్రశ్నలు అడిగింది. నేను వివరణ ఇచ్చా. నేను మాట్లాడే క్రమంలో కొన్ని తప్పులు దొర్లాయి అని చెప్పా. 

45
కావాల్సిన వాళ్లే కుట్ర చేశారు 

కానీ కొందరు నాకు కావలసిన వాళ్లే, నాతో కెరీర్ ప్రారంభించిన వాళ్లే నాపై కుట్ర చేస్తున్నారు. నా వ్యాఖ్యల తర్వాత జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ నన్ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సినిమాలు రాకపోతే, వ్యవసాయం చేసుకుని బ్రతుకుతా. నేను ఎవరి బెదిరింపులకు భయపడను. ఆత్మాభిమానం చంపుకుని అస్సలు భయపడను అని శివాజీ తెలిపారు. 

55
నాగబాబు కౌంటర్ 

శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ, చిన్మయి లాంటి వారు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజాగా నాగబాబు కూడా శివాజీని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు.  ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories