నటుడు శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని తన మునుపటి క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో శివాజీ శివన్నలా మారిపోయారు. యావర్, పల్లవి ప్రశాంత్ లని శివాజీ గైడ్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ నైటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఒకవైపు బిగ్ బాస్ క్రేజ్, మరోవైపు వెబ్ సిరీస్ సక్సెస్ తో శివాజీ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది.