అతడు మూవీలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తాయి. త్రివిక్రమ్ రాసిన కామెడీ డైలాగ్స్, సీన్స్ హాస్య ప్రియులకు ఎంతో ఇష్టం. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం ఉదయాన్నే జాగింగ్ కి వెళుతూ ఉంటాడు. ఆయన చేతిలో షేవింగ్ క్రీం ఉంటుంది. బ్రష్ చేసుకుంటున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం... బ్రహ్మానందం చేతిలో ఉంది పేస్ట్ అనుకుని, ఇవ్వమంటాడు.
బ్రహ్మానందం షేవింగ్ క్రీమ్ ని ధర్మవరపు సుబ్రహ్మణ్యంకి ఇస్తాడు. దాంతో బ్రష్ చేసుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ... ఈ పేస్ట్ ఏంటి ఇంత నురుగ వస్తుంది... మా ఊర్లో పేస్టుతో ఇంత నురుగ ఎందుకు రాదు?.. అని అడుగుతాడు. అదే సీన్ లో ఉన్న గిరిబాబు.. ఎందుకు రాదు, కాకపోతే పేస్ట్ కి బదులు సేవింగ్ క్రీమ్ అని అడగాలి, అంటాడు.