Vijay, The Goat The Greatest Of All Time , Review
విజయ్ చాలా కాలం నుంచి తెలుగులో మార్కెట్ కోసం పోరాడుతున్నారు. అయితే ఆయా సినిమాల డైరక్టర్స్ మార్కెట్ తెలుగులో యాడ్ అవుతూ వచ్చింది. మురగదాస్ తుపాకి కి, రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ వల్లే ‘లియో’ కి మంచి బజ్ వచ్చింది. అలాగే ‘వారసుడు’ కి దిల్ రాజు నిర్మాత కావటం, వంశీ పైడిపల్లి డైరక్టర్ కావటం తెలుగులో కలిసొచ్చింది.
కానీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కి రావాల్సిన బజ్ రాలేదని చెప్పాలి. అందుకు కారణం విక్రమ్ ప్రభుకు తెలుగులో అసలు మార్కెట్ లేకపోవటం.
అలాగే విజయ్ సైతం తెలుగులో ప్రమోషన్స్ ని పట్టించుకోకోపోవటం. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది. అసలు సినిమాలో కథేంటి, వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు చూద్దాం.
The GOAT advance sale collection report out
స్టోరీ లైన్
స్పెషల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ఆఫీసర్ గాంధీ (విజయ్). సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా) అతని టీమ్ మెంబర్స్. వారితో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. ఓ మిషన్ కోసం భార్య అను (స్నేహ) పిల్లలతో థాయ్ లాండ్ వెళ్లినప్పుడు ఐదేళ్ల కొడుకు జీవన్ ను కోల్పోతాడు.
గర్భంతో ఉన్న అను ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావడానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెడుతుంది. అలాగే తన జాబ్ వల్లే కుమారుడు మరణించాడని గిల్టీ ఫీలై తనకు తాను శిక్ష విధించుకుంటూ...స్క్వాడ్ వదిలి బయటకు వస్తాడు. ఎయిర్ పోర్ట్ లో ఇమ్రిగ్రేషన్ ఆఫీసర్ గా చేస్తూంటాడు.
దాదాపు పదిహేనేళ్ల తర్వాత వేర పని మీద మాస్కో వెళ్లిన గాంధీకి అచ్చం తనలాగే ఉన్న పాతికేళ్ల జీవన్ (విజయ్ డబుల్) కనిపిస్తాడు. కొడుక అని గుర్తిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకు తీసుకొస్తాడు. అయిత అక్కడ నుంచే కష్టాలు మొదలవుతాయి. అంతా ఆనందంగా ఉందనుకున్న సమయంలో గాంధీ కళ్ల ముందు అతని బాస్ నజీర్ (జయరామ్)ని ఎవరో చంపేస్తారు.
ఆ తర్వాత గాంధీ నా అనుకునే వాళ్లు ఒక్కొక్కరుగా హత్యకు గురి అవుతారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? మీనన్ (మోహన్) ఎవరు? తండ్రి గాంధీ మీద కొడుకు జీవన్ ఎందుకు పగతో ఉన్నాడు? అసలు చనిపోయాడు అనుకున్న జీవన్ ఎలా తిరిగి వచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపగలిగాడా? చివరకు ఏమైంది? అనేది విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
The GOAT
విశ్లేషణ
ఇలాంటి కథలు మనం బోలెడు చూసేసి ఉంటాం. అప్పుడెప్పుడో నాగార్జున, నాగేశ్వరరావు కలిసి ఇద్దరూ ఇద్దరే సహా(గుర్తురావటం లేదు ఇంకా చాలా ఉన్నాయి). అయితే అదే నాగేశ్వరారవు...ధైర్యం చేసి నాగార్జున తో కలిపి చేయటం ఎందుకుని రెండు పాత్రలూ ఆయనే చేసేస్తే... ఎలా ఉండేదో కానీ ...గోట్ సినిమాకు మాతృక అని మాత్రం అనిపించేది. అయితే ఈ మధ్య అలాంటి కథలు రావటం లేదు. అందుకే ఈ కథను విజయ్ కు చెప్పి ఒప్పించినట్లు ఉన్నారు వెంకట్ ప్రభు.
వాస్తవానికి కథగా చెప్పటానికి ట్విస్ట్ లతో ఇంట్రస్టింగ్ గా అనిపించే కాన్సెప్టు ఇది. అయితే ట్విస్ట్ ఓ సారి రివీల్ అయ్యాక..అరెరే ఇది ఇంతకు ముందు చూసిందే అనిపిస్తుంది. దానికి తోడు ఈ సినిమాకు పెద్ద మైనస్ బలమైన విలన్ లేకపోవటమే.
టెర్రరిస్ట్ లు విలన్ గా కనిపించినా మనకు పెద్దగా ఏమి అనిపించదు. విలన్ ఎవరో తెలిసాక మన థ్రిల్ అయ్యిపోతామని డైరక్టర్ అనుకుని ఉండవచ్చు కానీ మారుతున్న ప్రేక్షకుడుని అంచానా వేయటంలో వెంకట్ ప్రభు వెనుకబడ్డారనే అనిపిస్తుంది. అలాగని కథదే తప్పు అనలేం.
The GOAT
కొందరు యంగ్ డైరక్టర్స్ చిన్న పాయింట్ ని అద్బుతమైన స్క్రీన్ ప్లేతో అదరకొడుతున్నారు. ఈ సినిమాకు వచ్చేసరికి స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ చేయకపోవటంతో రొటీన్ టెంప్లేట్ లోకి వెళ్లిపోయి చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. టైట్ గా ఉంటేనే ఇలాంటి స్క్రిప్టులు బాగా వర్కవుట్ అవుతాయి.
తమిళంలో విజయ్ కు ఉన్న స్టార్ పవర్ తో ఇద్దరు విజయ్ లను ఒకేసారి చూడటం ఆసక్తిగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మనకు సాదా సీదాగా అనిపిస్తుంది. అలాగే హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ వో కొంత భాగం మార్చకుండా డైరక్ట్ గా లేపటం కూడా ఊహించలేం.
The Greatest Of All Time
ఇక ఫస్టాఫ్ చాలా స్లో గా నడుస్తూ డ్రాగ్ చేస్తూ విసిగిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి పుంజుకుంటుంది. సెకండాఫ్ లో తండ్రికు కొడుకే విలన్ అయ్యే సీన్స్ ఇంట్రస్టింగ్ గా అనిపించినా అంత లెంగ్త్ ని సస్టైన్ చేయలేకపోయారనే చెప్పాలి. డ్యూయిర్ రోల్ లో విజయ్ ఫెరఫార్మెన్స్ బాగున్నా జస్ట్ ఓకే అపిస్తూంటాయి ఆ సీన్స్.
అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో విలన్స్ ..హీరోని చిన్న పాటి గాయం కూడా చేయలేకపోవటం ఎంత సినిమాటెక్ గా సరిపెట్టుకుందామనుకున్నా మనస్సు ఒప్పదు. శివకార్తికేయన్, త్రిష గెస్ట్ రోల్స్ ఇంపాక్ట్ లేకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అవి తమిళ మార్కెట్ కోసం పెట్టుకున్నవి అనుకుంటా. హ్యూమర్ కూడా పెద్దగా పండలేదు.
Actor Thalapathy Vijays film The GOAT
టెక్నికల్ గా
సినిమా స్క్రిప్టు దశలోనే చాలా ట్రిమ్ చేయాల్సింది అనిపిస్తుంది. మూడు గంటలు సేపు చూడాలనిపించేటంత కంటెంట్ అంత స్ట్రాంగ్ గా కంటెంట్ లేదు. అయితే విజువల్స్ బాగున్నాయి. యవన్ శంకర్ రాజా మ్యూజిక్ లో ఉన్న పాటలు ఒక్కటి గుర్తు ఉండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యవన్ స్దాయిలో లేదు. ఈ రోజు ప్రతీ పెద్ద సినిమాకు BGM బ్యాక్ బోన్ గా ఉంటోంది.
కానీ ఈ సినిమాకు ఆ విషయంలో కలిసి రాలేదు. వెంకట్ రంజన్ ఎడిటింగ్ కూడా సోసోగా అనిపిస్తుంది. అక్కర్లేని సీన్స్ బోలెడు కనపడతాయి. డైరక్టర్ వెంకట ప్రభు సైతం పాత తమిళ సినిమాల్లో సీన్స్ రిపీట్ చేసినట్లు అనిపిస్తుంది. టెక్నికల్ విభాగంలో ఎక్కువ మార్కులు విజయ్ ని చిన్నవయస్సు వాడిగా చూపెట్టే VFX టీమ్ కే పడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విజయ్ సినిమా స్దాయిలోనే ఉన్నాయి.
Actor Thalapathy Vijay film The GOAT
నటీనటుల్లో వంక పెట్టలేని విధంగా రెండు పాత్రల్లో గాంధీ, జీవన్ గా విజయ్ ఇమిడిపోయారు. విలన్ గా విజయ్ అదరకొట్టారనే చెప్పాలి. మాస్ హీరోగా ఇన్నాళ్లూ విజయ్ ని చూసిన మనకు ఇది కొత్త ఎక్సపీరియన్స్. ప్రభుదేవా, జయరాం, ప్రశాంత్, మైక్ మోహన్, స్నేహ వంటి సపోర్టింగ్ యాక్టర్స్ తమ పరిధి మేరకు చేసుకుంటూ పోయారు.
The GOAT
ఫైనల్ థాట్
మరీ తీసి పారేసే సినిమా కాదు. అలాగని పరుగెత్తకు వెళ్లి మరీ చూడాలనిపించే సినిమా కాదు. విజయ్ అభిమాని కాకపోతే మెల్లిగా వెళ్లి చూడచ్చు.
Rating : 2.5/5