పనిమనిషికి ఆస్తులు రాసేసి మరణించిన నటుడు ఎవరో తెలుసా ? ఆమె కాళ్ళు మొక్కా అంటూ కొడుకు ఆవేదన

Published : Oct 15, 2025, 04:42 PM IST

Actor Ranganath: సీనియర్ నటుడు రంగనాథ్ జీవితం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆయన పనిమనిషి గురించి రంగనాథ్ తనయుడు నాగేంద్ర కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
విషాదకరంగా రంగనాథ్ జీవితం 

నటులుగా గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది సెలెబ్రిటీల జీవితం విషాదకరంగా ముగిసింది. నటులుగా ఎంత గొప్ప పేరు సంపాదించినా ఆర్థిక సమస్యలతో సతమతమైన నటీనటులు ఉన్నారు. అలాంటివారిలో నటుడు రంగనాథ్ ఒకరు. 70వ దశకం నుంచి ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. మన్మథుడు, నిజం, అడవి రాముడు, దేవరాయ, గోపాల గోపాల లాంటి చిత్రాల్లో రంగనాథ్ నటించారు. 

25
ఆర్థిక సమస్యలతో మృతి 

రంగనాథ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. ఆయన నటుడు కాకముందు ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. నటనపై ఆసక్తికతో జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. రంగనాథ్ 2015లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. మరణించే సమయమ్లో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్థిక సమస్యల కారణంగా చివరి రోజుల్లో రంగనాథ్ 5 వేలు రెంట్ హౌస్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

35
పనిమనిషి గురించి చెప్పిన కొడుకు 

తన పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే రంగనాథ్ మరణించినట్లు ఆరోపణలు వినిపించాయి. అదే విధంగా ఆయన పనిమనిషి గురించి కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో రంగనాథ్ తనయుడు నాగేంద్ర కుమార్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'మీనాక్షి అనే మహిళ మా ఇంట్లో ఆరేళ్ళ పాటు పనిమనిషిగా పనిచేసింది. అమ్మ మంచాన పడ్డప్పుడు ఆమె చాలా బాగా చూసుకుంది. నాన్నని కూడా ఆమె బాగా చూసుకునేది. 

45
పనిమనిషికి ఆస్తులు రాసేసి.. 

అమ్మ చనిపోయాక మేము వేరే ఇంట్లోకి మారాం. కానీ నాన్న మాతో రాలేదు.  షూటింగ్స్ తో బిజీగా ఉంటాను. కాబట్టి నాకు ప్రైవసీ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను అని అన్నారు. ఆమె నాన్నని ఇల్లు కొనివ్వమని అడిగినట్లు మాకు కూడా తెలిసింది. నాన్న కూడా ఆమెకి సాయం చేయాలి అనుకున్నారు. అప్పుడు నాన్న డిసైడ్ అయి ఆమెకి కొన్ని ఆస్తులు బాండ్ పేపర్స్ రెడీ చేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీనాక్షికి ఇచ్చారు. చనిపోయే ముందు ఆయన గోడపై మీనాక్షిని ఇబ్బంది పెట్టొద్దు అని రాశారు' అంటూ నాగేంద్ర కుమార్ తెలిపారు. 

55
ఆమె కాళ్ళు మొక్కాను 

పనిమనిషి మీనాక్షిపై మీరు మీ కుటుంబ సభ్యులు దాడి చేశారట కదా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి కూడా నాగేంద్ర కుమార్ బదులిచ్చారు. 'మేమెందుకు కొడతాం.. మా అమ్మని బాగా చూసుకున్నందుకు ఆమె కాళ్లపై పడి నేను మొక్కాను'  ఆమెకి మేము డబ్బు కూడా ఇచ్చాం. మా అమ్మ నాన్నకి మా కంటే ఎక్కువ నువ్వే చేశావు అని ఆమెకి కృతజ్ఞత తెలిపాం' అని నాగేంద్ర అన్నారు. కానీ మీడియాలో మాత్రం మాపై నిందలు వేశారు. రంగనాథ్ ని అయన కొడుకు, కుమార్తెలే చెంపేశారు.. సరిగ్గా చూసుకోకుండా రోడ్డున వదిలేశారు అంటూ తమపై ఆరోపణలు వచ్చినట్లు నాగేంద్ర తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories