సినిమాల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న రఘువరన్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఒత్తిడి, ఇతర సమస్యల వల్ల ఆయన మద్యానికి బాగా బానిసయ్యారని చెబుతారు. రోజులు గడిచేకొద్దీ ఈ అలవాటు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
ఒకసారి ఓ హిందీ సినిమా షూటింగ్ సమయంలో, ఓ స్టార్ హీరోనే తనను మద్యానికి బానిస చేశాడని రఘువరన్ చెప్పారు. తాను తాగనని బతిమాలినా, ఆ హీరోనే తనకు మద్యం అలవాటు చేశాడని రఘువరన్ చెప్పినట్లు సమాచారం. కానీ ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం రఘువరన్ ఎప్పుడూ బయటపెట్టలేదు. మద్యం వల్ల తన సినీ జీవితం, కుటుంబ జీవితం చాలా దెబ్బతిన్నాయని ఆయన బాధపడేవారట.