Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..

Published : Sep 19, 2026, 01:05 PM IST

Nani: జీవితాంతం ఆడవాళ్లు తమ జుట్టును ఎలా కాపాడుకుంటారో ఏమో కానీ.. వాళ్ల ఓపికకు నిజంగా పెద్ద దండం పెట్టొచ్చు అని హీరో నాని అన్నాడు. జుట్టు పెంచడంపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

PREV
14
డిఫరెంట్ లుక్‌లో నాని

టాలీవుడ్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. రాఘవ్ జుయల్, కాయదు లోహర్, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

24
జుట్టు పెంచి, జడవేసుకున్న నాని

'ది ప్యారడైజ్' సినిమా కోసం నాని పొడవాటి జుట్టు పెంచి, జడ వేసుకున్నాడు. దాదాపు 160 రోజుల పాటు ఆ జుట్టును కాపాడుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో హెయిర్ కేర్ గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

జడ గెటప్‌పై నానికి ఉన్న డౌట్

మొదట్లో హీరో జడ వేసుకుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ తనకు ఉండేదన్నాడు. ఆడవాళ్లు జడ వేసుకుంటే బాగుంటుంది కానీ, హీరో వేసుకుంటే ఎలా ఉంటుందో అని భయపడ్డానని చెప్పాడు. కానీ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో ధైర్యంగా ఆ లుక్ ట్రై చేశానని, ఫ్యాన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నారని నాని అన్నాడు.

34
చెన్నై ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ..

చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. పొడవాటి జుట్టుతో, జడ వేసుకుని నటించడం తనకు చాలా సవాల్‌గా అనిపించిందన్నాడు. జుట్టు పెంచి, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమని చెప్పాడు. షూటింగ్ జరిగిన 160 రోజులు ఆ గెటప్‌లో ఉండటం తనకు ఇబ్బందిగా అనిపించిందని వివరించాడు.

44
ఆడవాళ్లకు పెద్ద దండం..

ఆడవాళ్లు తమ జీవితాంతం జుట్టును ఎలా మెయింటైన్ చేస్తారో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందని నాని అన్నాడు. వాళ్ల ఓపికకు నిజంగా పెద్ద దండం పెట్టొచ్చని చెప్పాడు. ఈ సినిమా అనుభవం తర్వాత తనకు మహిళల మీద గౌరవం మరింత పెరిగిందని నాని మనసులోని మాట బయటపెట్టాడు.

Read more Photos on
click me!

Recommended Stories