కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా అందుకోవచ్చు అనడానికి మెగాస్టార్ చిరంజీవి జీవితం నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలోకి ఒక్కడుగా ప్రవేశించిన చిరంజీవి మెగా ఫ్యామిలీ అనే మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. టాలీవుడ్ టాప్ హీరోగా దశాబ్దాల పాటు ఏలిన చిరంజీవి ఆ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి.
ఐతే చిరంజీవి ఇప్పుడు ఎంత గొప్ప హీరో అయినా కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం అనేక పాట్లుపడ్డారు. అలాగే అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ఓ సంఘటనను చిరంజీవి తమ్ముడు నాగబాబు తెలియజేశారు. చెన్నైలో ఓ సినిమా ప్రివ్యూ వేదికగా చిరంజీవి అవమానానికి గురయ్యారట. చిరంజీవి చెన్నైలో అడయార్ ఫీల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. చిరంజీవి, సుధాకర్ మరియు హరిప్రసాద్ ముగ్గురు ఒకే రూములో ఉండేవారట. చిరంజీవికి పురాణం సూరి అనే ఓ మిత్రుడు కూడా ఉన్నారు.
పురాణం సూరి దర్శకుడు మరియు నటుడుగా చేస్తూ ఉండేవారు. ఐతే పురాణం సూరి ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారట. ఓ స్టార్ హీరో మూవీ ప్రివ్యూ చూడడానికి మిత్రులు సుధాకర్, హరి ప్రసాద్ తో సూరి తరపున చిరంజీవి వెళ్లారట. అక్కడ మొదటి వరసలో కూర్చున్న చిరంజీవిని సూరి కుటుంబం వెళ్లి వెనుక కూర్చో అన్నారట.
దానితో చిరంజీవి అక్కడికి నుండి వచ్చేశారట. ఒక ఆ మూవీ టాక్ తెలుకోవాలనిచిరంజీవిని పురాణ సూరి పిలిచినా ఆయన వెళ్లలేదట. చిరంజీవి కోపంగా ఉన్నారని తెలుసుకున్న సూరి విషయం ఆరా తీయగా ఫ్రెండ్స్ జరిగిన సంగతి చెప్పారట.
దానికి పురాణం సూరి చిరంజీవిని కలిసి వాళ్లు అంతే నువ్వు పట్టించుకోకు, నీ టాలెంట్ కి పెద్ద హీరో అవుతావు అన్నాడట. అప్పుడే చిరంజీవి హీరోని కాదు, నంబర్ వన్ హీరో అవుతాను అని చెప్పారట. మరి అలాంటి అవమానాల నుండి పుట్టిన కసితో చిరంజీవి టాప్ హీరోగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు.