Murali Mohan: వారిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టినట్టు ఉండేవారు.. నమ్మలేని నిజాన్ని బయటపెట్టిన నటుడు

Published : Mar 23, 2026, 08:00 AM IST

Superstar Krishna: సీనియర్ నటుడు మురళీ మోహన్ తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కృష్ణ - విజయ నిర్మల వివాహం, తనతో నటించిన హీరోయిన్లతో ఉన్న అనుబంధం, తనపై వచ్చిన రూమర్ల వెనుక ఉన్న నిజాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

PREV
15
మురళీ మోహన్ సినీ జ్ఞాపకాలు

ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త మురళీ మోహన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని అనేక మధుర స్మృతులను, వివాదాలను గురించి స్పందించారు. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగిన ఆయన, అప్పటి సినిమాల వాతావరణం, నటీనటుల మధ్య ఉండే సంబంధాల గురించి వివరించారు.

25
తనతో నటించిన హీరోయిన్లపై కీలక వ్యాఖ్యలు

తనతో నటించిన హీరోయిన్లలో శ్రీదేవి అత్యంత గ్లామరస్ అని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఆమె కళ్ళు, ఎక్స్‌ప్రెషన్స్, పర్సనాలిటీ తనకు సమానంగా(హైట్ విషయంలో కూడా) ఉండేవని చెప్పారు. అలాగే దీప కూడా చాలా అందంగా ఉండేవారని, అయితే ఆమె అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. జయసుధ గురించి మాట్లాడుతూ, ఆమె ఒక "నేచురల్ యాక్టర్" అని, ఆమెతో నటిస్తుంటే సినిమా సెట్‌లో ఉన్నట్టు కాకుండా నిజ జీవితంలోని క్యారెక్టర్‌తో ఉన్నట్టు అనిపిస్తుందని కొనియాడారు.

35
రూమర్లపై స్పందన

నటి జయచిత్రతో తన వివాహం జరిగిందని అప్పట్లో వచ్చిన ఒక రూమర్‌పై ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ వార్త రాసిన పత్రికకు తాము నోటీసులు పంపగా, వారు క్షమాపణలు చెప్పి వార్తను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. తాము కేవలం వృత్తిపరంగా మాత్రమే స్నేహితులమని, తాను జయచిత్రను తన సోదరిలా భావిస్తానని స్పష్టం చేశారు.

45
కృష్ణ - విజయ నిర్మల వివాహం

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల వివాహం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కృష్ణ.. విజయ నిర్మలని ఎంతగానో ప్రోత్సహించేవారని, ఆమె దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, చివరి వరకు విజయ నిర్మల కృష్ణని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు.

55
బిజినెస్ దృక్పథమే..

చివరగా, తాను ఒక నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎందుకు మారారో వివరిస్తూ, తనలో ఉన్న బిజినెస్ దృక్పథమే అందుకు కారణమని మురళీ మోహన్ వివరించారు.

Read more Photos on
click me!

Recommended Stories