BTS The Return
ప్రపంచ ప్రఖ్యాత దక్షిణ కొరియా బ్యాండ్ BTS సైనిక సేవల అనంతరం తిరిగి రావడంపై రూపొందిన డాక్యుమెంటరీ ఇది. మార్చి 20, 2026న విడుదలైన వారి ఆల్బమ్ ‘అరిరాంగ్’ తర్వాత ఈ డాక్యుమెంటరీ విడుదల అవుతోంది. స్టూడియో క్షణాలు, రిహార్సల్స్, వ్యక్తిగత అనుభవాలు ఇందులో చూపించబడతాయి. బ్యాండ్ ప్రయాణానికి సంబంధించిన అంతరంగిక దృశ్యాలను అభిమానులకు అందిస్తుంది.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: మార్చి 27, 2026
Something Very Bad Is Going to Happen
‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్‌తో ప్రసిద్ధి చెందిన ది డఫర్ బ్రదర్స్ రూపొందించిన హారర్ మినీ సిరీస్ ఇది. ఆరు ఎపిసోడ్‌లతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో కమిలా మోరోన్, ఆడమ్ డిమార్కో ప్రధాన పాత్రల్లో నటించారు. అడవుల్లో జరిగే ఒక కలల వివాహ వేడుక అనూహ్యంగా భయానక మలుపు తిరగడం కథలో కీలక అంశం.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: మార్చి 26, 2026
Detective Hole
నార్వేజియన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో మానసికంగా కృంగిపోయిన ఓ డిటెక్టివ్ ఒస్లో నగరంలో జరుగుతున్న దారుణ హత్యల పరంపరను దర్యాప్తు చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలతో పోరాడుతూనే కేసును చేధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవినీతి సహచరుడి అడ్డంకులతో దర్యాప్తు మరింత క్లిష్టమవుతుంది.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: మార్చి 26, 2026