సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? తొలిసారి దేవసేన లవ్ లో పడింది ఎప్పుడు? ఆమెను ప్రేమించిన వ్యక్తి ఎవరు? స్వీటి చెప్పిన ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలో స్టార్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. సినీ పరిశ్రమలో 'స్వీటీ' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే అనుష్క శెట్టి గురించి ఓ కొత్త విషయం వైరల్ అవుతోంది. 'బాహుబలి' దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అనుష్క, తన స్కూల్ డేస్‌లోనే ప్రేమలో పడిందట. తన ఫస్ట్ లవ్ కు సబంధించిన చిన్న అనుభవాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ.
24
స్కూల్ డేస్ లవ్
తన ఫస్ట్ లవ్ గురించి అనుష్క మాట్లాడుతూ, “స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు, తనంటే చాలా ఇష్టం కానీ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి, తన స్నేహితుడి ద్వారా 'ఐ లవ్ యూ' అని చెప్పించాడు. అది వినగానే నాకు నవ్వు వచ్చింది. కానీ, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయాను. ‘నేను అతన్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు ’' అని అనుష్క అన్నారు.
34
అమాయక ప్రేమ
ఈ అమాయక ప్రేమ అనుభవం చాలా మందికి వారి స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ప్రేమను నేరుగా చెప్పకుండా స్నేహితుల ద్వారా చెప్పించి, సిగ్గు పడటం చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఆ మెమరీస్ ను ఎవరు మర్చిపోలేరు కూడా. అనుష్క కు స్కూల్ డేస్ లో ఎదురైన ఈ అనుభవం ఆమెకు జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ ఆ అబ్బాయి ఎవరో ఆమె ఇప్పటివరకు వెల్లడించలేదు.
ప్రస్తుతం అనుష్క శెట్టి సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా విజయం తర్వాత, సినిమాల్లో బిజీ అవుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన ఘాటీ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనుష్క చేయబోయే సినిమాలపై రకరకాల రూమర్స్ ఉన్నాయి. అఫీషియల్ గా మాత్రం అనుష్క నుంచి ఎటువంటి ప్రకటన లేదు. చూడాలి నెక్ట్ స్వీటీ ఏప్రాజెక్ట్ తో ముందుకు వస్తుందో.