Harsha Chemudu
వైవా హర్ష గురించి తెలియని తెలుగువారు లేరు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలు, రీల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెంది హర్ష చెముడు సినిమాల్లో కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో పోస్ట్ పెట్టారు. మా అంకుల్ తప్పిపోయాడు, కాస్త వెతికి పెట్టండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
Harsha Chemudu
అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న మా అంకుల్ కనిపించకుండా పోయారు. ఆయన వయసు 91 ఏళ్లు. నాలుగు రోజుల క్రితం ఆయన వైజాగ్‌లోని ఇంటి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ పరిశీలించగా కంచెర్ల పాలెం ఏరియాలో చివరి సారిగా కనిపించారు. ఆయన ఎక్కడైనా కనిపిస్తే తెలియజేయండి,’ అంటూ వైవా హర్ష ఎమోషనల్ అయ్యారు.
https://www.instagram.com/p/DEjebFPzY1i/
ఆ వీడియోలో హర్ష.. " నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా సమస్య మన చుట్టు పక్కల వాళ్లకు జరిగితే ఒకలా ఉంటుంది, మన వరకు వస్తే అది ఒకలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాము. మా అంకుల్ ఏ. పాపారావు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం వైజాగ్‌లోని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చివరిసారిగా కంచరపాలెం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన కనిపించారు.
Harsha Chemudu
ఆయన చాలా నీరసంగా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీలో ఎవరైనా ఆయనను చూసినట్లయితే ముందుగా కాస్త ఫుడ్ ఇవ్వండి. ఆపై, వీడియోలో ఇచ్చిన నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వండి.." అని అభ్యర్థించారు. హర్ష షేర్ చేసిన వీడియోలో వాళ్ళ అంకుల్ పాపారావు రోడ్లపై నడుచుకుంటూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి.