దారుణమైన పరిస్థితుల్లో నటుడు ఫిష్ వెంకట్..? సహాయం కోసం ఎదురు చూపులు..

First Published | Sep 5, 2024, 9:44 PM IST

మీకు ఫిష్ వెంకట్ గుర్తున్నాడా.. కామెడీ విలన్  గా కడుపుబ్బా నవ్వించే ఈ నటుడి పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా ఉందో తెలుసా..? 
 

fish venkat

టాలీవుడ్ లో చాలామంది స్టార్ నటీనటులు మంచి పేరు తెచ్చుకుని.. ఆతరువాత కనిపించకుండా పోయారు. ఆడియన్స్ కు కూడా ఎవరో గుర్తు చేస్తే కాని.. అవును నిజమే ఆ నటుడు ఏమైపోయాడు అని ఆలోచించరు మనవారు. అలాంటి నటుటు చాలామంది ఉన్నారు. వారిలో ఫిష్ వెంకట్ కూడా ఒకరు. 

చిన్న పాత్రలు అయినా..మంచి పేరు తెచ్చుకున్నవారిలో పావలా శ్యామల.. ఫిష్ వెంకట్, నర్సింగ్ యాదవ్ లాంటి వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది ఫిష్ వెంకట్ గురించి. ఆయన ఈమధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఎక్కడున్నారు.. ఏమైపోయారు అని కామెడీ ప్రియులు ఆలోచనలో పడ్డారు. 

రీసెంట్ గా ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ ఆయన ఏం చేస్తున్నారు.. ఆయన పరిస్థితి ఏంటీ అనేది బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు. టాలీవుడ్ ఆడియన్స్ లో  ఫిష్ వెంక‌ట్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. ఆది మూవీతో వెండితెర‌పై అడుగు పెట్టిన ఫిష్ వెంక‌ట్‌.. కామెడీ టచ్ ఉండే రౌడీ పాత్రల ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. 

త‌నదైనన తెలంగాణ  యాస‌, న‌ట‌న‌తో స్పెషల్ ఇమేజ్ సాధించాడు ఫిష్ వెంకట్.  దాదాపుగా 25 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో  కొనసాగిన వెంకట్.. 2002 నుంచి గ‌త ఏడాది వ‌ర‌కు వంద‌కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆతరువాత చిన్నగా సినిమాల్లో కనిపించడం  తగ్గిపోయింది. కారణం ఏంటని కామెడీ ప్రియులు వెతుక్కున్నారు. 


అయితే ఒక‌ప్పుడు వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన ఫిష్ వెంక‌ట్‌.. ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు.  ఆరోగ్యం పూర్తిగా  పాడైపోయి.. చాలా ద‌య‌నీయ స్థితిలో ఆయన ఉన్నారు. అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా గ‌త కొంత కాలం నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు ఫిష్ వెంక‌ట్. 

ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది. తన తనబాధలు చెప్పుకుంటూ.. ఫిష్ వెంకట్ కన్నీరు పెట్టుకున్నారు. దాంతో ఆయన్ను అభిమానించేవారు ఈ విషయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.  

నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. ఆ టైమ్ లోనే బీపీ, షుగర్ బ‌య‌ట‌ప‌డ‌టంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి చాలా వీక్ అయ్యాను. కాలు మీద చర్మం పోతుంది. కొన్ని రోజులుగా నడవడం కూడా కష్టమైపోతుంది అన్నారు వెంకట్. 

అంతే కాదు విటితోనే ఇబ్బందిపుడుతుంటే.. మ‌రోవైపు కిడ్నీ సమస్యులు కూడా వెంటాడాయి. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డాక్టర్లు డయాలసిస్ చేయాలని అన్నారు.. లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. ఇప్పటికే  ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇలా ఒకటి తరువాత మరొకటి దెబ్బ తగులుతూనే ఉంది అని వాపోయారు ఫిష్ వెంకట్. 

అనారోగ్యం ఇలా ఉండటంతో.. సినిమా ఆఫర్లు వచ్చినా..  చేసే ఓపిక మాతరం లేదు. ఆపరేషన్స్ కు, డయాలసిస్ కు లక్షలు ఖర్చయ్యాయి. ప్ర‌స్తుతం కుటుంబం గడవ‌డం చాలా కష్టంగా మారింది. అయితే పిల్లులేరా.. వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆయన్న ప్రశ్నించగా..  ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది అని బదులిచ్చారు. 

కాని వారు తనను చూడరని చెప్పారు వెంకట్. డబ్బుల పరంగా తన కొడుకులు తనను ఏమాత్రం ప‌ట్టించుకోవట్లేదు. ఇక ఉన్న ఒక్క కూతురు అప్పుడ‌ప్పుడు  కొంత డ‌బ్బు ఇస్తూ.. సాయం చేస్తోంది అన్నారు  ఫిష్ వెంకట్. 

గ‌తంలో ఎంతో మందికి సాయం చేశాను. కానీ ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంక‌ట్ భావోద్వేగానికి గుర‌య్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంక‌ట్ ను టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆదుకోవాలని, అందరు కోరుతూ.. కామెంట్లు పెడుతున్నారు. 

అయితే ఫిష్ వెంకట్ శ్రీహరి ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. శ్రీహరిని దైవసమానంగా చూస్తారు వెంకట్. ఇక తనకు మంచి సినిమా కెరీర్ ను అందించిన వివి వినాయక్ అంటే కూడా వెంకట్ కు ఎంతో ఇష్టం. ఈ పరిస్థితుల్లో శ్రీహరి ఉండి ఉంటే వేరుగా ఉండేదని బాధపడ్డారు వెంకట్.  

అయితే ఫిష్ వెంకట్ ను ఇండస్ట్రీ కాని.. స్టార్లు కాని ఆదుకోవడం లేదు.. దాంతో ఈ విషయం రీసెంట్ గా బయకురావడంతో.. చిన్నగా ఒక్కొక్కరు ఫిష్ వెంటకు కు సాయం చేస్తున్నారు. రీసెంట్ గా ఓ నిర్మాత ఫిష్ వెంకట్ కు లక్షరూపాయలు సాయం ప్రకటించారు. 

Latest Videos

click me!