తెలుగులో స్టార్ సీనియర్ హీరోలు, యంగ్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది నయనతార. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరోలతో నటించింది. అటు తమిళంలో కూడా రజనీకాంత్, అజిత్, విజయ్, లాంటి స్టార్స్ సరసన మెరిసింది. అప్పట్లో నయనతార అంటే హీరోలందరికి లక్కీ అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆమెతో సినిమా అంటే మేకర్స్ పరుగులు పెడుతుంటారు.