Published : Jun 01, 2023, 06:58 PM ISTUpdated : Jun 02, 2023, 06:51 AM IST
ఎన్టీఆర్ అంటే టాలీవుడ్‌లో ఓ క్లీన్ ఇమేజ్ ఉంటుంది. అద్భుతమైన నటనకు కేరాఫ్. మిగిలిన హీరోలతో పోల్చితే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు తారక్. అలాంటి ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్నాడో వివాదాస్పద క్రిటిక్.
ఎన్టీఆర్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని దాన్ని క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. ఈ సినిమాతో ఇండియన్ మార్కెట్ దాటి వెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తారక్. హీరోగా, నటుడిగా తన సత్తా ఏంటో చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతూ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం షార్ట్ వెకేషన్‌కి ఫ్యామిలీతో వెళ్లారు తారక్.
25
ఇదిలా ఉంటే ఓ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, సినిమా క్రిటిక్‌గా చెలామణి అవుతూ పబ్బం గడుపుకుంటున్నాడు ఉమైర్ సందు అనే వ్యక్తి. నోరు విప్పితే హీరోహీరోయిన్లు, దర్శకులు ఇలా సినిమా వాళ్లకి సంబంధించి అక్రమ సంబంధాల పోస్టులు పెడుతూ తాను ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తాను ఫేమస్ కావడం కోసం సెలబ్రిటీలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల, హీరోయిన్ల నుంచి, టాలీవుడ్ హీరో హీరోయిన్ల వరకు ఎవరినీ వదలడం లేదు. అందరిపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర విమర్శలపాలవుతున్నాడు.
35
Image: NTR Jr / Instagram
ఇప్పటికే ఉమైర్ సందుని అందరు హీరోల ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. చెప్పలేని బూతులతో గడ్డి పెట్టినా అతను మారడం లేదు. వివాదాస్పద పోస్ట్ లు పెడుతూ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. ఓ సంచలన ఆరోపణ చేశాడు. మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్ ఒకటి చేశాడు. ఎన్టీఆర్‌కి మరో అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ ఉందంటూ పోస్ట్ పెట్టాడు. ఇటీవల ఎన్టీఆర్ మరో అమ్మాయితో దొరికిపోయాడని, అతను ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆయన ఫోన్‌ని భార్య(ప్రణతి) చెక్ చేయగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు అందరు హీరోలపై ఆరోపణలు చేశాడు. టాలీవుడ్‌లో ప్రతి ఒక్క నటుడు ఇలాంటి సీక్రెట్ ఎఫైర్స్ కలిగి ఉన్నారని పోస్ట్ చేశాడు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది.
45
Image: Devara new poster / Instagram
దీంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఉమైర్ సందుపై ట్రోల్స్, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పచ్చి బూతులు వాడుతూ ఆడుకుంటున్నారు. వాళ్లింట్లో పనిమనిషిగా చేస్తున్నావా రా? లేక బాత్ రూమ్‌లు కడుగుతున్నావా? ఎన్టీఆర్ ఏంటో మాకు తెలుసు, నువ్వు ఎదవ పోస్ట్ లు ఆపు అని బూతులు తిడుతున్నారు. ఇలా తగలబడి ఉన్నావేంట్రా?, నువ్వు సెట్ చేశావారా బ్రోకర్, నువ్వు పెద్ద గే అని అందరికి తెలుసు, నువ్వు కనిపిస్తే ఫ్యాన్స్ కుక్కని కొట్టినట్టు కొడతారు అంటూ రెచ్చిపోతున్నారు. అతన్ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది పెద్ద హాట్ టాపిక్ అవుతుంది.
55
ఎన్టీఆర్ ఎలాంటి వారో అందరికి తెలుసు. ఎంతటి క్లీన్ ఇమేజ్‌తో ఉంటారో ఆయన్ని ఇష్టపడే వాళ్లకే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా తెలుసు. చాలా హుందాగా, తనపనేదో తాను చేసుకుంటూ వెళ్తారు. అయితే సినిమాలు, లేదంటే ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా నందమూరి లెగసీని క్యారీ చేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అందరితోనూ స్నేహభావంతో ఉండటమే కాదు, మహిళలను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది టాలీవుడ్‌లో అందరికి తెలుసు. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న ఎన్టీఆర్‌పై బురద చల్లి తాను ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఉమైర్ సందు. దీంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ ఆడుకుంటుండటం విశేషం.