బేబమ్మ ఫోకస్ కోలీవుడ్ వైపు మళ్లిందా? మరో తమిళ స్టార్ సరసన కృతి శెట్టికి నటించే ఛాన్స్?

First Published | Jun 1, 2023, 6:00 PM IST

టాలీవుడ్ లో మొన్నటి వరకు వెలుగొందిన కృతిశెట్టి (Krithi Shetty)కి ప్రస్తుతం కోలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్ కమింగ్ ఫిల్మ్స్ లో ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. 
 

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ బ్యూటీ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించి బేబమ్మ గానూ బిరుదు పొందింది. తన అందంతో యువతను అట్రాక్ట్ చేసింది.
 

అయితే, బేబమ్మ నటించిన తొలి మూడు చిత్రాలు ‘ఉప్పెన‘తో పాటు ‘శ్యామ్ సింగరాయ్‘, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి హిట్ ను అందుకున్నాయి. దీంతో కృతి హ్యాట్రిక్ హీరోయిన్ గా మారింది. ఫలితంగా తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కాయి. కానీ ఆ చిత్రాల ఫలితాలు కాస్తా బెడిసికొట్టాయి.


ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వరుసగా డిజాస్టర్ గా నిలిచాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ‘కస్టడీ’ కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో కృతి శెట్టి రూట్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇతర భాషా చిత్రాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో కూడా బిజీగా కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ది వారియర్‘, ’కస్టడీ’ చిత్రాలతో అక్కటి ప్రేక్షకులను అలరించింది. 
 

తెలుగులో కాస్తా ఆఫర్లు తగ్గినట్టు కనిపిస్తుండటంతో బేబమ్మ చూపు కోలీవుడ్ వైపు మళ్లినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలా దర్శకత్వంలో సూర్య సరసన నటించాల్సి ఉంది. కొద్దిలో ఛాన్స్ మిస్సైంది.
 

ఇక ప్రస్తుతం వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు టాక్. సూర్య తమ్ముడు కార్తీ సరసన ఓ చిత్రంలో నటించబోతుందంటున్నారు. మరోవైపు విజయ్ దళపతి సరసన వెంకట్ ప్రభు డైరెక్షన్ లోనూ బేబమ్మను హీరోయిన్ గా ఎంచుకున్నారని టాక్. ఇప్పుడు తమిళ స్టార్ విశాల్ సరసన కూడా రొమాన్స్  చేయబోతుందని అంటున్నారు. వీటిపై మున్ముందు మరింత క్లారిటీ రానుంది. ఈ ప్రాజెక్టులు ఓకే అయితే ఇక బేబమ్మ కోలీవుడ్ లోనే సందడి చేయనుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!