శ్రీదేవిని స్టార్ ను చేసిన చంద్రమోహాన్, స్టార్ హీరోలకు పోటీ ఇచ్చిన నటుడు.

చంద్రమోహన్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఈమధ్య వరకూ యాక్టీవ్ గా నటించారు చంద్రమోహాన్.. హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్.. స్టార్ హీరోలకు కూడా పోటీ ఇచ్చారు శ్రీదేవికి మొదటి హీరో చంద్రమోహాన్.. ఆమె స్టార్ అవ్వడానికి ఆయనే కారణమట. 
 

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ 82 ఏళ్ల వయస్సులో  కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగు సినిమా వినీలాకాశంలో దృవతారగా ఎదిగాడు చంద్రమోహన్.. హీరోగా, కమెడీయన్ గా..  క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రిగా, తాతగా..  ఇలా విభిన్న పాత్రలు పోషించి మెప్పించి చంద్రమోహన్.. 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.  

తెలుగు చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించారు చంద్రమోహన్‌. శ్రీదేవికి మొదటి హీరో చంద్రమోహన్.. ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తే.. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది అనే సెంటిమెంట్ ఉండేది. అందుకే చంద్రమోహన్ జతగా నటించడానికి హీరోయిన్లు పోటీ పడేవారు. అంతే కాదు శ్రీదేవి చంద్రమోహన్ సరసన పదహారేళ్ళ వయస్సు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా చేయడంతోనే.. ఆమె వరుస అవకాశాలుసాధించిన హీరోయిన్ గా స్టార్ డమ్ ను సాధించింది.


అంతే కాదు ఆయనతో ఫస్ట్ సినిమా చేసిన శ్రీదేవి.. గతంలో బాలనటిగా చంద్రమోహన్ తో నటించింది. ఈ విషయం గురించి ఆయన చెపుతూ.. యశోద కృష్ణ' సినిమాలో బాలకృష్ణుడిగా శ్రీదేవి చేస్తే, నేను నారద మహర్షి పాత్రను చేశాను. ఆ సినిమా షూటింగు సమయంలో శ్రీదేవి నా ఒళ్లో పడుకుని నిద్రపోయేది. అలాంటి శ్రీదేవి నాకు హీరోయిన్ గా 'పదహారేళ్ల వయసు' సినిమా చేసింది. ఆ సినిమా 150 రోజులు ఆడింది. ఆ సినిమా తరువాత శ్రీదేవి కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయింది" అని చెప్పారు. 

చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా చేస్తే ఇక తిరుగుండదు అనే విషయాన్ని శ్రీదేవి .. ఆమె అమ్మగారే అందరితోను చెప్పారట. ఈ విషయం గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీదేవి తరువాత..  జయసుధ .. జయప్రద .. రాధిక .. విజయశాంతి .. సుహాసిని వీళ్లంతా నాతో చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. నా డేట్స్ ఖాళీగా లేకపోతే, నా కోసం భానుప్రియ చాలా రోజుల పాటు వెయిట్ చేసిందట. 
 

ఇక చంద్రమోహన్ తో నటించాలని ఆరాటపడ్డ హీరోయిన్లు చాలా మంది ఉన్నారట. అప్పట్లో.. ఆయనసరసన నటించిన  40 మంది హీరోయిన్ల వరకూ స్టార్స్ అయ్యారని ఆయన ఓ సారి చెప్పుకోచ్చారు. తెలుగు తెరపై హ్యాండ్సమ్ హీరోలుగా కృష్ణ .. శోభన్ బాబు ... రామకృష్ణ వంటి హీరోలు కొనసాగుతున్న సమయంలో హీరోగా  చంద్రమోహన్ గట్టిపోటీ కూడా ఇచ్చారు. అందరికంటే తాను చాలాస్పెషల్ అని నిరూపించుకున్నారు చంద్రమోహన్.

Chandra mohan

సుదీర్ఘమైన  సినిమా కెరియర్ ను చూసిన చంద్రమోహాన్ సినిమాల్లోకి రావాలని నేను అనుకోలేదట. సినిమాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు పడలేదు. మొదటి సినిమా 'రంగుల రాట్నం'తోనే ఆయనకు గుర్తింపు వచకచింది. ఆతరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేశారు.. దాదాపు 900లకు పైగా సినిమాలు చేశారు చంద్రమోహాన్.  

హీరోగా ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒక వైపు హీరోగా నటిస్తూనే..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ఆయనకే చెల్లింది. టాలీవుడ్ లో వెలుగు వెలిగిన చంద్రమోహన్.. మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Latest Videos

click me!