ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తలు, అభిషేక్ బచ్చన్ నెల జీతం ఎంతో తెలుసా?

First Published | Oct 9, 2024, 8:49 PM IST

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్  నెల సంపాదన ఎంత..? ఆస్తులు విలువ ఎంత..? ఐశ్వర్య రాయ్ తో నిజంగా ఆయన విడాకులు తీసుకోబోతున్నారా..? నిజమెంత..? 

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్

ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ చాలేళ్లుగా సంతోషంగా ఉన్నారు. వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో వారు సంతృప్తిగా జీవిస్తున్నారు.  అయితే, అభిషేక్, ఐశ్వర్య విడిపోబోతున్నారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి.  పుకార్లు షికారు చేస్తున్నాయి. 

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్

అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహంలో అభిషేక్, ఐశ్వర్య దూరంగా నిలబడి ఉండటం వంటి కొన్ని విషయాలు ఈవార్తలకు కారణం అయ్యాయి. ఈ విషయాలు జరుగుతుండగానే..  అభిషేక్ బచ్చన్ నెల జీతం గురించి ఒక వార్త వైరల్ అయింది.


ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్

సమాచారం ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిషేక్ బచ్చన్‌కు నెలకు రూ.18 లక్షల జీతం అందిస్తోంది. ఎలా అంటే, ప్రభుత్వ రంగ బ్యాంకు  పదిహేను సంవత్సరాల పాటు అభిషేక్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకుంది.

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం

ఒక వార్త సంస్థ  వ్యాసం ప్రకారం, అభిషేక్ బచ్చన్ తన జుహు ఇల్లు కింది అంతస్తు ను అద్దెకు ఇవ్వగా.. వారి నుంచి  నెలకు రూ.18.9 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో అద్దె పెరుగుతుందని అంచనా. ఐదేళ్ల తర్వాత రూ.23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలకు పెరుగుతుంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్

అభిషేక్ బచ్చన్ పెద్ద  మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టారు. ఇటీవలి నివేదికల ప్రకారం, అతను ముంబైలోని బోరివాలి పరిసరాల్లో రూ.15 కోట్లకు పైగా ఖర్చు చేసి.. ఆరు విలాసవంతమైన నివాసాలను కొనుగోలు చేశారట. వీటి ద్వారా చాలా అద్దె ఆయనకు చేరుతుంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్

అదనంగా, అతను తన తండ్రి జల్సా ఇంటి పక్కన ఉన్న జుహులోని సరికొత్త ఇంట్లో పెట్టుబడి పెట్టాడని చెబుతారు. అభిషేక్ నికర విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా అంచనా వేయబడింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్

అతను బ్రీత్: ఇంటూ ది షాడోస్ అనే  వెబ్ సిరీస్‌లో కూడా కనిపించాడు. షారుఖ్ ఖాన్ యొక్క మాగ్నమ్ ఆఫర్ కింగ్‌లో చేరడానికి అభిషేక్ బచ్చన్ రెడీగా ఉన్నాడు. ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు.

Latest Videos

click me!