ముద్దు సీన్ అవసరం, చూస్తే మీకే అర్థం అవుతుంది.. వివాదంపై నటి అభిరామి రియాక్షన్

tirumala ANPublished : May 29, 2025 2:50 PM

థగ్ లైఫ్ సినిమాలో నటుడు కమల్ హాసన్‌తో ముద్దు సీన్‌లో నటించడం వివాదాస్పదమైన నేపథ్యంలో, నటి అభిరామి వివరణ ఇచ్చారు.

14
కమల్ హాసన్ కామెంట్స్

ఎటు చూసినా థగ్ లైఫ్ సినిమా గురించే చర్చ. కమల్ హాసన్ థగ్ లైఫ్ ఆడియో వేడుకలో కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందని చెప్పడం దుమారం రేపింది. దీనిపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక ఎత్తయితే, థగ్ లైఫ్ సినిమాలో చాలా వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు కమల్ హాసన్, అభిరామితో ముద్దు సీన్‌లో నటించడం పెద్ద దుమారం రేపింది.

24
30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న నటితో ముద్దు సీన్

కమల్ హాసన్ తనకన్నా 30 ఏళ్లు చిన్నవారితో ముద్దు సీన్‌లో నటించడమే ఈ వివాదానికి కారణం. కమల్, అభిరామి కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు విరుమాండి సినిమాలో కమల్ హాసన్ భార్యగా నటించారు అభిరామి. ఆ తర్వాత 21 ఏళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కూడా కమల్ హాసన్‌కి భార్యగా నటించారు అభిరామి.

34
నటి అభిరామి పేరు వెనుక కథ 

నటి అభిరామి కమల్ హాసన్ వీరాభిమాని అట. ఎంతలా అంటే, ఆయన గుణా సినిమా చూసిన తర్వాత తన పేరుని అభిరామిగా మార్చుకున్నారట. ఆమె అసలు పేరు దివ్య. గుణా సినిమాలో కమల్ అభిరామి అనే పేరుని ఎక్కువగా ఉచ్చరిస్తారు. అందుకే ఆ పేరునే తన పేరుగా పెట్టుకున్నారట. అలాంటి వీరాభిమానికి కమల్‌తో జతకట్టే అవకాశం వస్తే వదులుకుంటారా. అందుకే థగ్ లైఫ్ సినిమా అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేశారట అభిరామి.

44
ముద్దు సన్నివేశం అవసరం

ఈ నేపథ్యంలో, ముద్దు సీన్ వివాదంపై అభిరామి వివరణ ఇచ్చారు. “అది 3 సెకన్ల ముద్దు సీనే. ట్రైలర్‌లో చూపించడంతో తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమా చూస్తే ఆ సీన్ అవసరమని అర్థమవుతుంది. కానీ దాని గురించి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతర నటులు ముద్దు సీన్‌లలో నటించలేదా? స్టార్ హీరో నటించాడంటేనే జనాలు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా సాధారణమే” అని అభిరామి అన్నారు.

Read more Photos on
click me!