విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక ? చీర గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు, ఆమె ఇచ్చిన హింట్ తో పసిగట్టిన నెటిజన్లు

Published : May 29, 2025, 01:33 PM IST

రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీసినవిగా అభిమానులు భావిస్తున్నారు. రష్మిక కూర్చుని ఉన్న స్థలం విజయ్ దేవరకొండ ఇల్లు అనేలా అందులో హింట్ ఉంది.

PREV
15
విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ ఎఫైర్ రూమర్స్ 

టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. వీరిద్దరూ తరచూ జంటగా కనిపించడం, వెకేషన్స్ కి వెళుతున్నట్లు హింట్స్ ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు ఈ జంట తమ మధ్య సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఓ సందర్భంలో రష్మిక మీడియాతో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు కదా అని బదులిచ్చింది. కానీ నేరుగా విజయ్ దేవరకొండ పేరు మాత్రం ప్రస్తావించలేదు. 

25
విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక ?

తాజాగా రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు మళ్లీ ఈ ప్రచారాన్ని పెంచేలా చేశాయి. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీసినవిగా అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అందులో పేర్కొన్న క్యాప్షన్ చూస్తే.. రష్మిక పరోక్షంగా విజయ్ దేవరకొండ, అతడి కుటుంబాన్ని ఉద్దేశించి చెబుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

35
చీర గిఫ్ట్ గా..

రష్మిక తన పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇలా రాశారు.. “ఈ ఫోటోలన్నీ నా అభిమానమైన వాటితో నిండి ఉన్నాయి.. ఆ కలర్, ఆ వాతావరణం, ఆ స్థలం, ఒక అందమైన మహిళ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఈ చీర, ఈ ఫోటోలు తీసిన వ్యక్తి ఇలా ఇందులో ప్రతి అంశం లైఫ్ లో భర్తీ చేయలేనివి'' అని రష్మిక పేర్కొంది. రష్మికకి ఆ చీర గిఫ్ట్ గా ఇచ్చింది విజయ్ దేవరకొండ తల్లి అని నెటిజన్లు భావిస్తున్నారు. ఫోటోలు తీసిన వ్యక్తి విజయ్ దేవరకొండ అని అంటున్నారు. నెటిజన్ల సందేహానికి కారణం ఉంది. 

45
హింట్ ఇచ్చిన రష్మిక  

రష్మిక కూర్చుని ఉన్న స్థలం విజయ్ దేవరకొండ ఇల్లు అనేలా అందులో హింట్ ఉంది. గతంలో విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక, పరశురామ్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. అందులో ఉన్న బ్యాగ్రౌండ్, ఇప్పుడు రష్మిక పోస్ట్ చేసిన ఫోటోల్లోని బ్యాగ్రౌండ్ ఒకేలా ఉంది. అందుకే రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంది అని అంతా భావిస్తున్నారు. 

55
విజయ్, రష్మిక చిత్రాలు 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా మొదటిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనంతరం 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు వారి జంటపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని ఏర్పరచాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories