ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు,మొత్తానికి వసంత్ చిత్రల నిశ్చితార్థం అయిపోయింది అని అనుకుంటారు. అప్పుడు మాలిని, ఇదంతా నా కోడలు వల్లే అని అంటుంది. దానికి సులోచన, లేదు ఇదంతా మా అల్లుడి వల్లే అని అంటుంది. దానికి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు.ఇంతలో వాళ్ళ భర్తలు వాళ్ళిద్దరిని ఆపి, చూశారా ముందు వరకు నా కొడుకు గొప్ప, నా కూతురు గొప్ప అని కొట్టుకునే వారు. ఇప్పుడు, నా కోడలు గొప్ప, నా అల్లుడు గొప్ప అని కొట్టుకుంటున్నారు దీన్నే మార్పు అంటారు అని అంటారు.