Ennenno Janmala Bandham: 'డాక్టర్'ను కలిసిన యష్.. ఖుషి తన కూతురేనా అనే అనుమానం పెరిగిపోవడంతో?

Published : Apr 06, 2022, 01:04 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం అవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Ennenno Janmala Bandham: 'డాక్టర్'ను కలిసిన యష్.. ఖుషి తన కూతురేనా అనే అనుమానం పెరిగిపోవడంతో?

చీకటి పడటంతో యష్ (Yash) ఖుషిని తనపై పడుకోబెట్టుకుని ఆలోచనలో పడతాడు. ఖుషి ఎప్పటికీ వదలను అనుకోని అనుకుంటాడు. అప్పుడే ఖుషి ఐ లవ్ యు నాన్న అనటంతో పక్కనే పడుకున్న వేద లేచి చూసి ఆనందపడుతుంది. ఎప్పుడు ఖుషితో (Khushi) ఇలాగే ఉండాలి అని కోరుకుంటుంది.
 

27

ఇక అభిమన్యు (Abhimanyu) యష్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకోని రాత్రికి రాత్రే యష్ (Yash) కు తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఇక అభిమన్యు నెంబర్ చూసి యష్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. వెంటనే అభిమన్యు మరో పోలీస్ కి ఫోన్ చేయటంతో యష్ కొత్త నెంబర్ అనుకొని లిఫ్ట్ చేస్తాడు.
 

37

అభిమన్యు మాట్లాడటంతో కోపంగా రియాక్ట్ అవుతాడు. ఖుషి (Khushi) గురించి టాపిక్ తీసి యష్ (Yash)ను మరింత బాధపెట్టాలని ప్రయత్నిస్తాడు. దీంతో యష్ అభిమన్యు పై గట్టిగా అరవడంతో వేద చూసి ఏం జరిగిందో అనుకుంటుంది. ఉదయాన్నే మాలిని వాకింగ్ చేస్తూ కనిపిస్తుంది.
 

47

అది చూసిన సులోచన (Sulochana) వెటకారం గా మాట్లాడుతుంది. ఇక మాలిని తను బరువు తగ్గాలని వాకింగ్ చేస్తున్నానని చెపుతుంది. అలా కాసేపు మరి ఇద్దరి మధ్య సరదాగా సాగుతుంది. ఇక ఇంట్లో యష్ కనిపించకపోయేసరికి వేద (Vedha) ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. బయటకి రావడంతో అక్కడ తన తల్లి, తన అత్తయ్య ఇద్దరు కలిసి వ్యాయామాలు చేస్తూ కనిపిస్తారు.
 

57

వాళ్లను కూడా అడగటంతో మాకు కనిపించలేదు అని చెబుతారు. యష్ (Yash) మాత్రం డాక్టర్ అయిన తన బెస్ట్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తాడు. ఆయనతో తన గురించి చెబుతూ ఖుషి (Khushi) తన కూతురు కాదని అంటున్నారు అని దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పాలి అని అడుగుతాడు.
 

67

దాంతో ఆ డాక్టర్ డీఎన్ఏ టెస్ట్ చేయాలి అని దానికి కృషి వెంట్రుకలు లేదా గోర్లను తీసుకొని రమ్మంటాడు. మరోవైపు ఇంట్లో వేద (Vedha) స్కూల్ కి వెళ్ళను అని మారం చేస్తూ ఉంటుంది. ఇక అందరితో కలిసి ఒక ఆట ఆడుకుంటుంది. అప్పుడే యష్ (Yash) రావడంతో యసు దగ్గర కూడా మొండి చేయటంతో వేద అమ్మ మాట వినాలి అని చెబుతుంది.
 

77

యష్ (Yash) అమ్మ మాట వినాలని చెప్పగా సరే అని అంటుంది. తనకు జడ తన నాన్న వేయాలి అని మారం చేయటంతో యష్ తనకు జడ చక్కగా వేస్తాడు. ఇక తనపై ఖుషికు (Khushi) ఉన్న ప్రేమను తలుచుకొని మురిసిపోతాడు.

click me!

Recommended Stories